ODI World cup 2023
ODI World Cup 2023 Semi Finals Match: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీలో సెమీఫైనల్స్ కు భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు చేరుకున్నాయి. దీంతో ఈనెల 15న (బుధవారం) ముంబయి వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 16న (గురువారం) ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్ కతా వేదికగా రెండో సెమీఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి వస్తే ఏ జట్టును విజేతగా ప్రకటిస్తారు? రెండు సెమీఫైనల్స్ మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ ఏఏ జట్ల మధ్య జరుగుతుందనే విషయాలను తెలుసుకుందాం.
Also Read : ENG vs PAK : 6.4 ఓవర్లలో 338 పరుగులు.. బై బై పాకిస్థాన్.. మీమ్స్ వైరల్
ఈనెల 15న భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మంబయి వేదికగా తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తే.. అవకాశం ఉన్నంత మేరకు ఓవర్లను తగ్గించి మ్యాచ్ నిర్వహిస్తామని ఐసీసీ తెలిపింది. ఈ క్రమంలో వర్షం పడినా వర్షం తగ్గిన వెంటనే ఆటగాళ్లు మైదానంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. వీలును బట్టి డక్‌వర్త్ లూయిస్ పద్దతిని ఉపయోగిస్తారు. అయితే, వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిస్థాయిలో జరగకుంటే రిజర్వ్ డే లభిస్తుంది. రిజర్వ్ డే రోజుకూడా వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగితే.. అదికూడా డక్‌వర్త్ లూయిస్ పద్దతిని ఉపయోగించలేని విధంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు.
రెండో సెమీఫైనల్ మ్యాచ్ రోజుకూడా వర్షం అంతరాయం కలిగిస్తే రిజర్వే డే రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రోజుకూడా వరుణుడు కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగితే మ్యాచ్ కొన్ని ఓవర్లు జరిగే అవకాశం ఉన్నా నిర్వహించి డక్‌వర్త్ లూయిస్ పద్దతిన విజేతను ప్రకటిస్తారు. ఒక్కబాల్ కూడా పడకుండా మ్యాచ్ రద్దయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ ప్రకారం.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు అగ్రస్థానంలో ఉన్నాయి.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే.. గ్రూప్ దశలో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టును టోర్నీ విజేతగా ప్రకటిస్తారు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. డక్ వర్త్ లూయిస్ పద్దతిని ఉపయోగించాలంటే .. ఒక మ్యాచ్ ను ఒక్కో జట్టుకు 20 ఓవర్ల కంటే తక్కువకు కుదిస్తే విజేతను ప్రకటించడానికి డక్‌వర్త్-లూయిస్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఒక్కో మ్యాచ్ కు 20 ఓవర్లు వేయడానికి ముందు మ్యాచ్ రద్దు చేయబడితే మ్యాచ్ ఫలితం లేదని ప్రకటించబడుతుంది.
https://twitter.com/BCCI/status/1723372190207250527
https://twitter.com/ICC/status/1723513455817179323