Wasim Akram
ODI World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ మెగాటోర్నీలో పాక్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడగా.. కేవలం రెండు మ్యాచ్ ల్లోనే విజేతగా నిలిచింది. సోమవారం చెన్నైలో జరిగిన మ్యాచ్ లో పసికూన జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో ఘోర ఓటమిపాలైంది. పాక్ నిర్ధేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అఫ్గాన్ బ్యాటర్లు ఛేధించారు. పాక్ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి. అఫ్గాన్ పై ఘోర ఓటమితో ఆ జట్టు మాజీ ప్లేయర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ పాక్ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంతో ఇబ్బందిగా ఉంది. 280కిపైగా పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించడం అనేది చాలా పెద్ద విషయం. పిచ్ తడిగా ఉందా లేదా అనేది పక్కనపెడితే ఓసారి పాకిస్థాన్ ప్లేయర్స్ ఫీల్డింగ్ చూడండి.. ఫిట్ నెస్ స్థాయిలు ఎలా ఉన్నాయో.. అంటూ ఓ పాకిస్థాన్ టీవీ షోలో అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతీరోజూ వీళ్లు ఎనిమిది కిలోల మటన్ తిన్నట్లు కనిపిస్తున్నారు. వీళ్లకు ఫిట్ నెస్ టెస్టులు నిర్వహించొద్దా? అని అక్రమ్ ప్రశ్నించారు. సెలక్షన్ కు ఓ పద్దతి ఉండాలి, ప్రతీ ఒక్క ప్లేయర్ ఫిట్ నెస్ టెస్ట్ పాసై ఉండాలి.. మైదానంలో ఫిట్ గా ఉండాలని అని అక్రమ్ అన్నారు. వసీం అక్రమ్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
“8-8 kilo Kadhai khate hain.”
Wasim Akram lashes out Pakistani players on their fitness.pic.twitter.com/dPRgjzn0Uv
— Cricketopia (@CricketopiaCom) October 24, 2023