IND vs ENG Match : ఇంగ్లాండ్ తో మ్యాచ్.. 20ఏళ్లుగా టీమిండియాకు దక్కని విజయం.. అశ్విన్ రీఎంట్రీ ఉంటుందా? గత రికార్డులు ఎలా ఉన్నాయంటే ..

లక్నోలోని ఏకనా స్టేడియం పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. దీంతో భారత్ జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IND vs ENG Match

ODI World Cup 2023 IND vs ENG Match : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా భారత్ జట్టు ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మెగాటోర్నీలో భారత్ జట్టు ప్లేయర్స్ అద్భుత ఫామ్ ను కనబరుస్తున్నారు. ఫలితంగా జట్టు ఆడిన ఐదు మ్యాచ్ లలో విజయాలు సాధించింది. ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే మెగాటోర్నీలో భారత్ జట్టుకు సెమీఫైనల్ బెర్తు ఖాయమవుతుంది. అయితే, ఇంగ్లాండ్ జట్టు ఈ టోర్నీలో ఫేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ జట్టు మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. భారత్ పై మ్యాచ్ లో విజయం సాధించాలనే పట్టుదలతో ఆ జట్టు బరిలోకి దిగబోతుంది.

Also Read : BAN vs NED Match : నెదర్లాండ్స్ పై బంగ్లాదేశ్ ఓటమి.. బూటుతో కొట్టుకున్న అభిమాని.. ఆ తరువాత ఏమన్నాడంటే? వీడియో వైరల్

వరల్డ్ కప్ చరిత్రలో ఇరుజట్ల గణాంకాలు ..
ప్రపంచ కప్ టోర్నీలో గత 20ఏళ్లుగా భారత జట్టు ఇంగ్లాండ్ జట్టును ఓడించలేక పోయింది. రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు ఆ రికార్డుకు బ్రేక్ చేస్తుందన్న నమ్మకాన్ని అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. భారత్ చివరిసారిగా 2003 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. ఆ తరువాత ఇంగ్లీష్ జట్టుతో తలపడినప్పటికీ టీమిండియా విజయం సాధించలేక పోయింది. ప్రపంచ కప్ చరిత్రలో ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడ్డాయి. మూడు సార్లు ఇండియా (1983, 1999, 2003 వరల్డ్ కప్ లలో) జట్టు వియం సాధించగా.. నాలుగు సార్లు ఇంగ్లాండ్ (1975, 1987, 1992, 2019 సంవత్సరాల్లో) జట్టు విజేతగా నిలిచింది. 2011 వరల్డ్ కప్ లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ టై అయింది.

Also Read : ODI World Cup 2023 : ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో విఫ‌ల‌మైన స్టార్ ఆట‌గాళ్లు.. బాబ‌ర్ నుంచి బ‌ట్ల‌ర్ వ‌ర‌కు

అశ్విన్ రీ ఎంట్రీ ఖాయమా?
లక్నోలోని ఏకనా స్టేడియం పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. దీంతో భారత్ జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ జట్టు ప్లేయర్స్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో రాణిస్తున్నారు. హార్దిక్ గాయం కారణంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. శార్దూల్ స్థానంలో షమీ జట్టులోకి వచ్చాడు. అయితే, సూర్యకుమార్ విఫలం అవగా.. షెమీ మ్యాచ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. దీంతో ఈరోజు ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో తుది జట్టులో అహ్మద్ షమీ ప్లేస్ ఖాయంగా కనిపిస్తోంది. అశ్విన్ ను తుదిజట్టులోకి తీసుకోవాలని జట్టు మేనేజ్ మెంట్ భావిస్తోంది. అశ్విన్ తుదిజట్టులో చేరాలంటే సూర్యకుమార్ యాదవ్ లేదా ఒక ఫేసర్ ను తప్పించాల్సి ఉంటుంది. ఫేసర్ ను తప్పించాల్సి వస్తే.. అహ్మద్ సిరాజ్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

భారత్ తుది జట్టు (అంచనా) :
రోహిత్ (కెప్టెన్), శుభ్ మన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్ దీప్, అశ్విన్ /సిరాజ్, బుమ్రా, షమి.

ఇంగ్లాండ్ తుది జట్టు (అంచనా) :
మలన్, బెయిర్ స్టో, రూట్, స్టోక్స్, బట్లర్ (కెప్టెన్); లివింగ్ స్టన్, బ్రూక్/ మెయిన్ అలీ, రషీద్, విల్లీ, వోక్స్, వుడ్ / ఆట్కిన్సన్.