ODI World Cup 2023 : ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో విఫ‌ల‌మైన స్టార్ ఆట‌గాళ్లు.. బాబ‌ర్ నుంచి బ‌ట్ల‌ర్ వ‌ర‌కు

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ సగం పూర్తి అయ్యింది. అక్టోబ‌ర్ 25 నాటికి 24 మ్యాచులు పూర్తి అయ్యాయి.

ODI World Cup 2023 : ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో విఫ‌ల‌మైన స్టార్ ఆట‌గాళ్లు.. బాబ‌ర్ నుంచి బ‌ట్ల‌ర్ వ‌ర‌కు

Babar Azam- Jos Buttler

ODI World Cup : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ సగం పూర్తి అయ్యింది. అక్టోబ‌ర్ 25 నాటికి 24 మ్యాచులు పూర్తి అయ్యాయి. మ్యాచులు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ప‌సికూన‌లు అనుకున్న జ‌ట్లు పెద్ద జ‌ట్ల‌కు షాకులు ఇచ్చాయి. టోర్నీకి ముందు టైటిల్ ఫేవ‌రెట్లుగా ప‌రిగ‌ణించిన జ‌ట్లు అనూహ్యంగా త‌డ‌బ‌డుతున్నాయి. డిఫెండింగ్ చాంఫియ‌న్ అయిన ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక జ‌ట్లు ఈ టోర్నీలో త‌మ‌దైన ముద్ర‌ను వేయ‌డంలో విఫ‌లం అయ్యాయి. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. అలాగే స్టార్ ఆట‌గాళ్లు కొంద‌రు ఈ మెగా టోర్నీలో రాణించ‌డంలో విఫ‌లం అవుతున్నారు. వారు ఎవ‌రో ఓ లుక్కేద్దాం..

1. టెంబా బావుమా

ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు వ‌రుస విజ‌యాలు సాధిస్తూ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉంది. అయితే.. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో ఆ జ‌ట్టు ప‌టిష్టంగానే క‌నిపిస్తున్నా ఆ జ‌ట్టును ఓ స‌మ‌స్య వేధిస్తోంది. అదే ఆ జ‌ట్టు కెప్టెన్ టెంబా బావుమా ఫామ్. ఈ మెగా టోర్నీలో ఐదు మ్యాచుల‌ను ద‌క్షిణాఫ్రికా ఆడ‌గా మూడు మ్యాచుల్లో మాత్ర‌మే బ‌వుమా ఆడాడు. అనారోగ్యం కార‌ణంగా రెండు మ్యాచులు ఆడ‌లేదు. మూడు మ్యాచుల్లో క‌లిపి 59 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. మిగిలిన బ్యాట‌ర్లు దాదాపుకు వంద‌కు పైగా స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తుంటే బ‌వుమా స్ట్రైక్ రేటు 64.83 కావ‌డం గ‌మ‌నార్హం.

2. జానీ బెయిర్ స్టో

టోర్నీ ఆరంభానికి ముందు జానీ బెయిర్ స్టో పై ఎన్నో అంచ‌నాలు ఉండేవి. అత‌డు ఖ‌చ్చితంగా అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో మొద‌టి ఐదు స్థానాల్లో ఒక‌డిగా ఉంటార‌ని అంచ‌నా వేశారు. అయితే.. బెయిర్ స్టో భార‌త పిచ్‌ల‌పై తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నాడు. నాలుగు మ్యాచుల్లో 97 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఐపీఎల్‌లో ఆడిన అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ అత‌డు రాణించ‌లేక‌పోతున్నాడు.

3. జోస్ బ‌ట్ల‌ర్‌

ఐపీఎల్‌లో ప‌రుగులు వ‌ర‌ద పారించే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌నదైన ముద్రను వేయ‌లేక‌పోతున్నాడు. నాలుగు మ్యాచుల్లో 21.75 స‌గ‌టుతో 87 ప‌రుగులు చేశాడు. మంచి ఆరంభాల‌ను అందుకుంటున్నప్ప‌టికీ వాటిని భారీ స్కోర్లుగా మల‌చ‌డంలో విఫ‌లం అవుతున్నాడు.

4. లియామ్ లివింగ్ స్టోన్‌

ఐపీఎల్‌లో ఎన్నో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు ఆడాడు లియామ్ లివింగ్ స్టోన్‌. భార‌త పిచ్‌ల‌పై అత‌డికి పూర్తి అవ‌గాహ‌న ఉంది. అయితే.. మెగా టోర్నీలో మాత్రం విఫ‌లం అవుతున్నాడు. మూడు మ్యాచుల్లో 34 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డ‌ర్‌లో కీల‌క బ్యాట‌ర్ అయిన లివింగ్ స్టోన్ రాణించ‌డ‌పోవ‌డం కూడా ఇంగ్లాండ్ ఓట‌ముల‌కు ఓ కార‌ణం.

ODI World Cup 2023 : మాజీ కెప్టెన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. పాక్ ఆట‌గాళ్ల‌కు ఐదు నెల‌లుగా జీతాలు లేవు.. ఇలాగే ఆడుతారు మ‌రీ..!

5.బాబ‌ర్ ఆజాం

పాకిస్థాన్ జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ మొద‌టి రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. అయితే.. ఆ త‌రువాత వ‌రుసగా మూడు ప‌రాజ‌యాల‌తో సెమీస్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. వ‌న్డేల్లో ప్ర‌పంచ నంబ‌ర్ 1 ర్యాంకులో ఉన్న బాబ‌ర్ ఆరు మ్యాచుల్లో 34.50 స‌గ‌టుతో 207 ప‌రుగులే చేశాడు. ఓ అర్థ‌శ‌త‌కం మాత్ర‌మే సాధించాడు. బ్యాట‌ర్‌గా త‌న స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న బాబ‌ర్ చేయ‌డం లేదు. దీని ప్ర‌భావం జ‌ట్టు ఆట‌తీరుపై ప‌డుతోంది.

6. న‌జ్ముల్ హుస్సేన్ శాంటో..

బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌లో న‌జ్ముల్ హుస్సేన్ శాంటో ఒక‌డు. ష‌కీబ్ గాయంతో రెండు మ్యాచుల‌కు దూరం కాగా అత‌డి స్థానంలో కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాడు. అత‌డు కీల‌క మైన నంబ‌ర్ 3, 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు వ‌స్తున్నాడు. అయితే.. 5 మ్యాచుల్లో 74 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో మిగిలిన వారిపై భారం ప‌డుతోంది.

7. ధ‌నంజ‌య డిసిల్వా..

ఆల్‌రౌండ‌ర్ అయిన ద‌నంజ‌య డిసిల్వా అటు బంతితో ఇటు బ్యాటింగ్‌లో రాణించి శ్రీలంక విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని జ‌ట్టు మేనేజ్మెంట్ భావించింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు త‌న‌దైన ముద్రను వేయ‌లేక‌పోయాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ తీయ‌లేదు స‌రిక‌దా అత‌డి ఎకాన‌మీ 6.73గా ఉంది. బ్యాటింగ్‌లో 73 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఆల్‌రౌండ‌ర్‌గా పూర్తిగా విఫ‌లం అయ్యాడు.

8. షాదాబ్ ఖాన్‌..

పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ అయిన షాదాబ్ ఖాన్‌.. స్పిన్‌కు అనుకూల‌మైన భార‌త పిచ్‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విప‌లం అవుతున్నాడు. అటు బ్యాటింగ్‌లో కూడా రాణించ‌క‌పోవ‌డంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అత‌డికి ప‌క్క‌న బెట్టారు. నాలుగు మ్యాచుల్లో 74 ప‌రుగులు చేశాడు. రెండు వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు.

ODI World Cup 2023 : పాకిస్థాన్ సెమీస్ దారులు మూసుకుపోలేదా..? ఇంకా అవ‌కాశం ఉందా..? ఎలాగో తెలుసా..?

9. మ‌హేశ్ తీక్ష‌ణ‌..

త‌న మిస్ట‌రీ స్పిన్‌తో బ్యాట‌ర్ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తాడ‌ని శ్రీలంక జ‌ట్టు భావించింది. అయితే.. ఈ ఆఫ్ స్పిన్న‌ర్ స్పిన్ పిచ్‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌లం అయ్యాడు. నాలుగు మ్యాచుల్లో కేవ‌లం రెండు వికెట్లే ప‌డ‌గొట్టాడు. గాయాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. తీక్ష‌ణ ఫామ్‌లోకి రావ‌డం లంకకు ఎంతో అవ‌స‌రం.

10. ముస్తాఫిజుర్ రెహ‌మాన్‌..

ముస్తాఫిజుర్ రెహ‌మాన్ త‌న‌దైన రోజున ఎలాంటి జ‌ట్టును అయినా ముప్పు తిప్ప‌లు పెడుతాడు. అయితే.. మెగా టోర్నీలో అత‌డు 5 మ్యాచులు ఆడి కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. త‌న‌దైన ప్ర‌ద‌ర్శ‌నను చేయ‌డంలో విఫ‌లం అయ్యాడు.