ODI World Cup 2023 : భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ విరామ సమయంలో రైనా, కోహ్లీ ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

కోహ్లీ, రైనా చాలాకాలం డ్రెస్సింగ్ రూంను పంచుకున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహంకూడా ఉంది. తాజాగా మైదానంలో

Virat Kohli, Suresh Raina (File Photo)

IND vs ENG Match : భారత్ వేదికగా జరుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా విజయపరంపర కొన‌సాగుతోంది. ల‌క్నో వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 100 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో భారత్ మ‌ళ్లీ అగ్ర‌స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ విరామ సమయంలో టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా, విరాట్ కోహ్లీ కలిసిఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా బ్యాటింగ్ పూర్తిచేసుకొని ఫీల్డింగ్ కు వచ్చే సమయంలో విరాట్ కోహ్లీ, రైనా ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకోవటం వీడియోలో కనిపించింది.

Also Read : Rohit Sharma : ఇంగ్లాండ్ పై భారీ విజయం.. అయినా ప్రతిసారి ఇలా ఉండదన్న రోహిత్ శర్మ.. అలా ఎందుకన్నాడంటే?

కోహ్లీ, రైనా చాలాకాలం డ్రెస్సింగ్ రూంను పంచుకున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహంకూడా ఉంది. తాజాగా మైదానంలో వీరిద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకొని అభినందనలు తెలుపుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇదిలాఉంటే ఈ మ్యాచ్ లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. కోహ్లీ 56 మ్యాచ్ ల తరువాత పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు.