Mohammed shami : వరల్డ్ కప్ లో షమీ అద్భుత ప్రదర్శనపై మాజీ భార్య షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

షమీ - హాసిన్ జహాన్ లు 2014లో పెళ్లి చేసుకోగా 2015లో వారికి కూతురు జన్మించింది. 2018లో హాసిన్ జహాన్ షమీపై వేధింపుల కేసు నమోదు చేసింది.

Mohammed shami Ex Wife Haseen Jahan

Haseen Jahan : భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తుంది. జట్టులో ఫాస్ట్ బౌలర్ అహ్మద్ షమీ తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి నాలుగు మ్యాచ్ లకు షమీకి తుది జట్టులో అవకాశం దక్కలేదు. న్యూజిలాండ్ జట్టుతో మ్యాచ్ నుంచి తుది జట్టులో షమీకి అవకాశం దక్కింది. అప్పటి నుంచి అతను ఆడిన ప్రతీ మ్యాచ్ లో షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. వరుసగా వికెట్లు తీస్తూ భారత్ జట్టు విజయంలో కీలక భూమిక పోషిస్తున్నాడు. నాలుగు మ్యాచ్ లు ఆడిన షమీ ఏకంగా 16 వికెట్లు తీశాడు. షమీ ఆటతీరుపై ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో షమీ మాజీ భార్య హసీన్ జహాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Glenn Maxwell : బాబోయ్ వీరబాదుడు బాదాడు.. వాంఖడే స్టేడియంలో మ్యాక్స్‌వెల్‌ విశ్వరూపం.. ఈ వీడియో చూడండి

ఓ హిందీ టీవీ ఛానెల్ లో హసీన్ జహాన్ చర్చలో పాల్గొంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ లో షమీ ప్రదర్శనపై హసీన్ వద్ద ప్రస్తావిస్తూ మీరు ఎలా ఫీలవుతున్నారు అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన హసీన్.. నేను క్రికెట్ కు, క్రికెటర్లకు అభిమానిని కాదు. వరల్డ్ కప్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అతడు మంచి ప్రదర్శన చేస్తూ.. అలాగే ఆడితే అతడు భారత్ జట్టులోనే ఉంటాడు. బాగా సంపాదిస్తాడు. అది మా భవిష్యత్ ను మరింత సురక్షితం చేస్తుంది అంటూ హాసీన్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో హసీన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత చౌకబారుగా ఆలోచించడం ఎలా సాధ్యమని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుండగా.. డబ్బుకోసమే ఇదంతా చేస్తావా అంటూ హాసిన్ జవాన్ ను కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

Also Read : ODI World Cup 2023: ఆస్ట్రేలియాపై ఓడినా అఫ్గానిస్థాన్ జట్టుకు సెమీస్ కు వెళ్లే అవకాశం..! ఫోర్త్ ప్లేస్ కోసం ఆ మూడు జట్లు పోరాటం ..

షమీ – హాసిన్ జహాన్ లు 2014లో పెళ్లి చేసుకోగా 2015లో వారికి కూతురు జన్మించింది. 2018లో హాసిన్ జహాన్ షమీపై వేధింపుల కేసు నమోదు చేసింది. కొద్దిరోజుల క్రితమే గృహహింస కేసు కింద కోల్ కతా కోర్టు హసీన్ కు మహ్మద్ షమీ నెలకు లక్షాముప్పై వేలు భరణంగా చెల్లించాలని ఆదేశించిన విషయం విధితమే.

 

ట్రెండింగ్ వార్తలు