Shubman Gill Health Condition : శుబ్‌మాన్‌ గిల్ తిరిగి జట్టులో చేరబోతున్నాడా? బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఏం చెప్పాడంటే

కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడానికి ఇషాన్ కిషన్ అత్యంత ఆచరణీయమైన ఎంపిక అని విక్రమ్ రాథోర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది.

Shubman Gill

ODI World Cup 2023 Shubman Gill : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడింది. టీమిండియాలో కీలక బ్యాటర్‌గా కొనసాగుతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆ మ్యాచ్ లో ఆడలేదు. డెంగీ ఫివర్ బారినపడటంతో అస్వస్థతకు గురయ్యాడు. డెంగీ ఫీవర్ కారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోవటంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గిల్ ప్లేట్లెట్ల సంఖ్య 70వేలకు తగ్గిపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా అతణ్ని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స అనంతరం గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా గిల్ ఆరోగ్య విషయంపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ కీలక విషయాన్ని వెల్లడించారు.

Read Also : ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్ నుంచి గిల్ ఔట్‌..? మరో ఆట‌గాడి కోసం చూస్తున్న సెలక్టర్లు..? ఆ ఇద్ద‌రికి గోల్డెన్ ఛాన్స్‌..!

గిల్ ఆరోగ్య విషయంపై విక్రమ్ రాథోర్ ను మీడియా ప్రశ్నించగా.. అతను చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆ తరువాత అతన్ని తిరిగి హోటల్ కు తీసుకొచ్చారని చెప్పాడు. గిల్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు. వైద్య బృందం అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ – ఇండియా మ్యాచ్ సమయానికి గిల్ జట్టులో చేరుతాడా అనే విషయంపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి గిల్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు.. ఆడుతాడని మేముకూడా ఆశిస్తున్నామని చెప్పారు. మరోవైపు గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా పంపడంపై రాథోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also : ODI World Cup 2023: ఆ ఒక్క క్యాచ్ వదిలేసి.. భారత్ విజయానికి బాటలు వేసిన ఆసీస్.. వీడియో వైరల్

కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడానికి ఇషాన్ కిషన్ అత్యంత ఆచరణీయమైన ఎంపిక అని విక్రమ్ రాథోర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. ప్రతిఒక్కరికి వారి సొంత ఆటతీరు ఉంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా పరుగులు రాబట్టగిలిగే ప్లేయర్స్ టీమిండియాలో ఉన్నారని రాథోర్ చెప్పారు. ఇదిలాఉంటే బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్గానిస్థాన్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈనెల 14న అహ్మదాబాద్ పాకిస్థాన్ వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు