ICC World Cup 2023: ప్రపంచ కప్ తరువాత బంగ్లాదేశ్ కెప్టెన్ పై దాడి..! వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే?

ప్రపంచ కప్ టోర్నమెంట్ లో బంగ్లా జట్టు విఫలమైన తరువాత ఆ జట్టు కెప్టెన్ షకీబ్ పై దాడి అంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shakib Al Hasan

World Cup 2023 Shakib Al Hasan : భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీలో బంగ్లాదేశ్ పేలువమైన ఆటతీరును కనబర్చింది. ఫలితంగా ఆ దేశ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఆ జట్టు లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. అయితే, ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పై దాడి చేసినట్లు ఉంది.

Also Read : ICC Bans Transgender : అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్స్ పై ఐసీసీ నిషేధం.. ఎందుకంటే?

ప్రపంచ కప్ టోర్నమెంట్ లో బంగ్లా జట్టు విఫలమైన తరువాత ఆ జట్టు కెప్టెన్ షకీబ్ పై దాడి అంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. షకీబ్ ను కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి చుట్టుముట్టారు. లాగడంతో షకీబ్ కిందపడిపోయాడు. ఆ తరువాత అతను అతికష్టంమీద ఆ గుంపు నుంచి బయటపడ్డాడు. అయితే, వైరల్ అవుతున్న వీడియో ఇప్పటి కాదని తెలుస్తోంది. ఆ వీడియో ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన ఘటనది.

Also read : India vs Australia : ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. చాహల్‌కు దక్కని చోటు.. లెగ్ స్పిన్నర్ రియాక్షన్ చూశారా?

2023మార్చి నెలలో షకీబ్ ను దుబాయ్ లోని ఆరవ్ జ్యూవెలర్స్ నిర్వహించిన ఈవెంట్ కు ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు షకీబ్ వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి లాగే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారింది. అదే వీడియో ప్రపంచ కప్ లో బంగ్లా ఘోర పరాభవం తరువాత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు