Ian Matos : ఒలింపిక్ స్టార్ ఇయాన్ కన్నుమూత

2010 సౌత్ అమెరికన్ గేమ్స్ లో ఇతను మూడు కాంస్య పతకాలు గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మాటోస్ చనిపోవడంతో బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ స్పందించింది...

Swimming

Olympic Diver Ian Matos : స్టార్ ఒలింపియన్ ఇయాన్ మాటోస్ ఇక లేరు. బ్రెజిల్ కు చెందిన ఈ క్రీడాకారుడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇతనికి 32 ఏళ్లు. గత రెండు నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్నారు. చికిత్స పొందుతున్న మాటోస్…ఆరోగ్య పరిస్థితి బుధవారం విషమించింది. దీంతో అతను కన్నుమూశారు. ఇక డైవర్ ఇయాన్ మాటోస్ విషయానికి వస్తే…2016 రియో ఒలింపిక్స్ లో మూడు మీటర్ల స్ప్రింగ్ బోర్డ్ లో పోటీ పడ్డారు.

Read More : Bharat Bandh : డిసెంబర్ 31 వరకు భారత్ బంద్..? నిజమెంత

అయితే..పతకం మాత్రం గెలవలేదు. కానీ…అతని అద్భుత ప్రదర్శన మాత్రం అందర్నీ ఆకట్టుకొంది. 2010 సౌత్ అమెరికన్ గేమ్స్ లో ఇతను మూడు కాంస్య పతకాలు గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మాటోస్ చనిపోవడంతో బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ స్పందించింది. ఆయన మృతికి సంతాపం ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు వెల్లడించింది.