Bharat Bandh : డిసెంబర్ 31 వరకు భారత్ బంద్..? నిజమెంత

దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలుసుకోకుండా కొందరు ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు, తమ వాళ్లకు..

Bharat Bandh : డిసెంబర్ 31 వరకు భారత్ బంద్..? నిజమెంత

Bharat Bandh

Bharat Bandh : సోషల్ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో అన్నే నష్టాలు కూడా ఉంటున్నాయి. సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఇది ఆనందించే విషయమే. అదే సమయంలో సోషల్ మీడియాలో అవాస్తవాలు పెరిగిపోతున్నాయి. ఫేక్ న్యూస్ ల సమస్య ఎక్కువైంది. ఆ వార్త నిజమో కాదో తెలుసుకోకుండా నెటిజన్లు వాటిని గుడ్డిగా షేర్ చేస్తున్నారు, ఫార్వర్డ్ చేస్తున్నారు. అందరిని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. దీంతో సమస్య మరింత పెరుగుతోంది. తాజాగా సోషల్ మీడియాలో మరో ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో ఆ పోస్టు వైరల్ గా మారింది. ఆ ప్రచారం దేని గురించి అంటే భారత్ బంద్ గురించి.

January 1 Alert : జనవరి 1 నుంచి RBI కొత్త రూల్స్‌.. ఆన్‌లైన్ పేమెంట్లపై ఈ నిబంధనలు తప్పనిసరి..

దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలుసుకోకుండా కొందరు ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు, తమ వాళ్లకు ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో గందరగోళం నెలకొంది.

Best Smart Phones in India 2021 : డిసెంబర్ 2021లో రూ.25వేల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే..!

భారత్ బంద్ గురించి జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. భారత్ బంద్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రకటనేదీ చేయలేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. అలాంటి ఫొటోలు, మేసేజ్ లు షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేసింది.