AUS vs SA: పిచ్చకొట్టుడు కొట్టిన కంగారూలు.. ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో సెకండ్ హయ్యస్ట్ రన్స్…

ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ సెంచరీలతో చెలరేగారు. గ్రీన్ సైతం సెంచరీతో కదం తొక్కాడు. హెడ్ 103 బంతుల్లో 142 పరుగులు బాదాడు.

AUS vs SA: పిచ్చకొట్టుడు కొట్టిన కంగారూలు.. ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో సెకండ్ హయ్యస్ట్ రన్స్…

Updated On : August 24, 2025 / 5:29 PM IST

AUS vs SA: సౌతాఫ్రికాతో మూడో వన్డేలో ఆస్ట్రేలియా చెలరేగిపోయింది. ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా ఆడారు. పరుగుల సునామీ సృష్టించారు. బౌండరీల వర్షం కురిపించారు. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆస్ట్రేలియాలోని మెకె వేదికగా మూడో వన్డే జరిగింది.

పిచ్చకొట్టుడు కొట్టిన కంగారూలు.. ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో సెకండ్ హయ్యస్ట్ రన్స్ నమోదు చేశారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 431 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక స్కోరును నమోదు చేసింది.

ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ సెంచరీలతో చెలరేగారు. గ్రీన్ సైతం సెంచరీతో కదం తొక్కాడు. హెడ్ 103 బంతుల్లో 142 పరుగులు బాదాడు. 17 ఫోర్లు, 5 సిక్సులు కొట్టాడు. మిచెల్ మార్ష్ 106 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇక గ్రీన్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. కేవలం 55 బంతుల్లనే 118 రన్స్ చేశాడు. 6 ఫోర్లు, 8 సిక్సులు బాదాడు. ఇక అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీతో మెరిశాడు.

తొలి వికెట్ కు 250 రన్స్ పార్టనర్ షిప్..

హెడ్, మార్ష్ తొలి వికెట్ కు 250 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఏ వన్డేలోనైనా హెడ్, మార్ష్ 250 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం మొదటి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం. విశేషమేమిటంటే, గత 8 సంవత్సరాలలో ఆస్ట్రేలియన్ ఓపెనర్లు 250+ పరుగులు చేయడం ఇది ఐదవసారి. హెడ్ 250+ ఓపెనింగ్ భాగస్వామ్యంలో పాల్గొనడం ఇది మూడవసారి. (AUS vs SA)

హెడ్ ​​చేసిన 142 పరుగులు దక్షిణాఫ్రికాపై ఒక ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరు కూడా. డేవిడ్ వార్నర్ (173), రికీ పాంటింగ్ (164) మాత్రమే ప్రోటీస్‌పై మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆడారు.

విధ్వంసం సృష్టించిన గ్రీన్..

కామెరాన్ గ్రీన్ సైతం విధ్వంసం సృష్టించాడు. మార్నస్ లబుషేన్ కంటే ముందు మూడవ స్థానంలో వచ్చిన అతడు సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకోవడం విశేషం. ఒక ఆస్ట్రేలియన్ ఆటగాడు చేసిన రెండవ వేగవంతమైన సెంచరీ ఇదే. 55 బంతుల్లోనే 118 పరుగులతో గ్రీన్ అజేయంగా నిలిచాడు. 2023 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్‌పై గ్లెన్ మాక్స్‌వెల్ 40 బంతుల్లో శతకం చేశాడు. ఇప్పటివరకు అదే ఆస్ట్రేలియన్ బ్యాటర్ రికార్డ్.

గ్రీన్ సెంచరీ ఆసీస్ గడ్డపై ఇప్పటివరకు నమోదైన అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ కూడా. మాక్స్ వెల్ 51 బంతుల్లో, డివిలియర్స్ 52 బంతుల్లో చేసిన సెంచరీల రికార్డ్ ను గ్రీన్ బ్రేక్ చేశాడు. ఈ రెండు శతకాలు 2015 ప్రపంచ కప్‌లో అత్యధిక స్కోరు సాధించిన సమయంలో వచ్చాయి.(AUS vs SA)

వన్డే ఇన్నింగ్స్‌లో టాప్ 3 ఆటగాళ్లు సెంచరీ చేయడం వన్డే చరిత్రలో ఇది రెండోసారి. వన్డే ఇన్నింగ్స్‌లో ముగ్గురు వేర్వేరు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది ఐదవసారి. ఆస్ట్రేలియాకు ఇది తొలిసారి.

ఇక 19 సంవత్సరాల క్రితం సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో ఆసీస్ 434 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇప్పుడు 431 రన్స్ చేసింది. ఆరుసార్లు ప్రపంచ కప్ ఛాంపియన్లుగా నిలిచిన ఆసీస్ కు వన్డేలలో ఇది రెండవ అత్యధిక స్కోర్.

వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా అత్యధిక స్కోర్లు:
434/4 vs SA, జోహన్నెసర్గ్ 2006
431/2 vs SA, మెకే 2025
417/6 vs AFG, పెర్త్ 2015

సౌతాఫ్రికా వన్డే చరిత్రలో ఘోర పరాజయం..
మూడో వన్డేలో సౌతాఫ్రికా ఘోర పరాజయం పాలైంది. ఛేదనలో సౌతాఫ్రికా 24.5 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 276 రన్స్ తేడాతో ఓడిపోయింది. రన్స్ పరంగా వన్డేల్లో ఇది సౌతాఫ్రికాకు అతిపెద్ద ఓటమి. అంతకుముందు 2023 వరల్డ్ కప్ లో భారత్ చేతిలో 243 రన్స్ తేడాతో ఓడింది. ఇది మూడు వన్డేల సిరీస్. ఇందులో తొలి రెండు మ్యాచుల్లో సౌతాఫ్రికా గెలిచింది. 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.

Also Read: ఆసియా క‌ప్‌కు ముందు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. స‌పోర్ట్ స్టాఫ్‌ నుంచి ఒక‌రు ఔట్‌..