BCCI : ఆసియాకప్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. సపోర్ట్ స్టాఫ్ నుంచి ఒకరు ఔట్..
మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది. ఈ సమయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తీసుకున్న నిర్ణయం

BCCI sacks Gambhirs support staff member ahead of Asia Cup 2025
BCCI : మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది. ఈ సమయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సపోర్టింగ్ స్టాఫ్ నుంచి మరొకరిని తప్పించింది. మసాజ్ థెరపిస్ట్ రాజీవ్‌కుమార్‌ను పెట్టింది. దాదాపు 15 సంవత్సరాలుగా అతడు జట్టుతో ఉండగా, ఇటీవల అతడి పదవీకాలాన్ని పొడిగించలేదు.
‘రాజీవ్ సేవలను ఇక కొనసాగించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఓ మసాజర్‌ను నియమించింది.’ అని క్రికెట్ వర్గాలు తెలిపాయి. సహాయక సిబ్బంది ఎక్కువకాలం పాటు జట్టుతో ఉండడం వల్ల అనుకున్నంత మేర ఫలితాలు రాకపోవచ్చునని బీసీసీఐలోని ఉన్నతాధికారులు భావించినట్లు ఆంగ్లమీడియాలో వార్తలు వస్తున్నాయి.
రాజీవ్‌కుమార్‌కు జట్టుతో మంచి అనుబంధం..
సుదీర్ఘకాలంగా జట్టుతో ఉండడంతో రాజీవ్‌కుమార్‌కు జట్టుతో మంచి అనుంబంధం ఉంది. ముఖ్యంగా పేసర్లకు ఎంతో మద్దతుగా నిలిచేవాడని అంటున్నారు. ప్లేయర్లతో స్నేహపూర్వకంగా ఉంటాడని గతంలో షమీ చేసిన పోస్టుతో అతడు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులైనప్పటి నుండి టీమ్ ఇండియా బ్యాక్‌రూమ్ సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయి. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ నిష్క్రమణ తరువాత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌ను కూడా పక్కనబెట్టింది బీసీసీఐ. అయితే.. ఏమైందో తెలియదు గానీ ఆరువాత యూటర్న్ తీసుకుని ఇంగ్లాండ్ పర్యటనకు ముందు దిలీప్‌కు మళ్లీ బాధ్యతలు అప్పగించింది. వచ్చే నెలలో జరిగే ఆసియా కప్‌లో దిలీప్ భారత జట్టులో ఫీల్డింగ్ కోచ్‌గా ఉంటాడో లేదో ఇంకా తెలియదు.
టీమ్ ఇండియా ప్రస్తుత సపోర్ట్ స్టాఫ్ సభ్యులు వీరే..
* ప్రధాన కోచ్ – గౌతమ్ గంభీర్
* అసిస్టెంట్ కోచ్ – ర్యాన్ టెన్ డోస్కటే (ఫీల్డింగ్ విధులను కూడా నిర్వహిస్తున్నారు)
* బ్యాటింగ్ కోచ్ – సితాన్షు కోటక్
* బౌలింగ్ కోచ్ – మోర్నీ మోర్కెల్
Shreyas Iyer : నిన్న జట్టులో చోటు, నేడు వన్డే కెప్టెన్సీ ఛాన్స్.. రెండూ మిస్సాయే..
* స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ – అడ్రియన్ లె రౌక్స్
* ఫీల్డింగ్ కోచ్ – టి దిలీప్
* త్రోడౌన్ స్పెషలిస్ట్ – రాఘవేంద్ర ద్వివేది (రఘు)
* లాజిస్టిక్స్ మేనేజర్ – ఉపాధ్యాయ
* వీడియో విశ్లేషకుడు – హరి