Bangladesh : ఆసియాక‌ప్‌కు బంగ్లాదేశ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న.. 16 మందితో.. మాజీ కెప్టెన్ పై వేటు.. మూడేళ్ల త‌రువాత స్టార్ ప్లేయ‌ర్‌కి చోటు..

బంగ్లాదేశ్‌(Bangladesh) జ‌ట్టుకు లిట‌న్ దాస్ (Litton Das) నాయ‌క‌త్వం వ‌హిస్తాడు.ఈ జ‌ట్టులో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్..

Bangladesh : ఆసియాక‌ప్‌కు బంగ్లాదేశ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న.. 16 మందితో.. మాజీ కెప్టెన్ పై వేటు.. మూడేళ్ల త‌రువాత స్టార్ ప్లేయ‌ర్‌కి చోటు..

Bangladesh Announce Asia Cup 2025 Squad

Updated On : August 23, 2025 / 8:00 AM IST

Bangladesh : సెప్టెంబ‌ర్ 9 నుంచి యూఏఈ వేదిక‌గా ఆసియా క‌ప్ 2025 ప్రారంభం కానుంది.

ఈ మెగాటోర్నీ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. 16 మంది స‌భ్యుల‌తో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.బంగ్లాదేశ్‌(Bangladesh) జ‌ట్టుకు లిట‌న్ దాస్ (Litton Das) నాయ‌క‌త్వం వ‌హిస్తాడు.

ఈ జ‌ట్టులో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ నూరుల్ హ‌స‌న్‌కు చోటు ద‌క్కింది. అత‌డు మూడు సంవ‌త్స‌రాల క్రితం అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్ ఆడ‌డం గ‌మ‌నార్హం. అత‌డు పొట్టి ఫార్మాట్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022లో ఆస్ట్రేలియాపై చివ‌రి సారిగా మ్యాచ్ ఆడాడు.

కాగా.. ఆసియాక‌ప్‌కు ముందు నెద‌ర్లాండ్స్‌తో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌లో ఆసియా క‌ప్‌కు ఎంపికైన ఆట‌గాళ్లు పాల్గొన‌నున్న‌ట్లు బీసీబీ తెలిపింది.

Ravichandran Ashwin : సిరీస్ మ‌ధ్య‌లో హ‌ఠాత్తుగా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డం పై అశ్విన్ కామెంట్స్‌..

దేశ‌వాళీ క్రికెట్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌డంతోనే హ‌స‌న్‌కు చోటు ద‌క్కిన‌ట్లు సెల‌క్ట‌ర్లు తెలిపారు.

అదే విధంగా ఏడాదిన్న‌ర విరామం త‌రువాత సైఫ్ హ‌స‌న్ కూడా జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. అత‌డు చివ‌రి సారిగా ఆసియాక‌ప్ 2023లో బంగ్లాదేశ్ త‌రుపున ఆడాడు.

కాగా.. మాజీ టీ20 కెప్టెన్ న‌జ్ముల్ హుస్సేన్ కు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.

ఆసియాక‌ప్ 2025లో బంగ్లాదేశ్ గ్రూప్ బిలో ఉంది. ఆ జ‌ట్టుతో పాటు అఫ్గానిస్థాన్, హాంకాంగ్‌, శ్రీలంక జ‌ట్లు ఉన్నాయి. ఇక గ్రూప్ ఏలో భార‌త్, పాకిస్తాన్, ఒమ‌న్‌, ఆతిథ్య యూఏఈలు ఉన్నాయి.

బంగ్లాదేశ్ లిట్టన్ దాస్ కెప్టెన్సీలో శ్రీలంకపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచింది. ఆ తర్వాత స్వదేశంలో పాకిస్థాన్‌పై కూడా టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఆసియాక‌ప్ 2025లోనూ లిట్ట‌న్ దాస్ నాయ‌క‌త్వంలోని బంగ్లా సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంద‌ని ఆ జ‌ట్టు అభిమానులు భావిస్తున్నారు.

Cameron Green : ఆల్‌టైమ్‌ రికార్డును సమం​ చేసిన కామెరూన్ గ్రీన్‌.. అయినా గానీ..

ఆసియాక‌ప్ 2025 కోసం ఎంపికైన జ‌ట్టు ఇదే..
లిట‌న్ దాస్(కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జేకర్ అలీ అనిక్, షమీమ్ హుస్సేన్, కాజీ నూరుల్ హసన్ సోహన్, మెహెదీ హసన్, రిషాద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, మహమ్మద్ సైఫుద్దీన్.

స్టాండ్‌బై ఆట‌గాళ్లు : సౌమ్య సర్కార్, మెహెదీ హసన్ మీరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్.