Tokyo Olympics : టోక్యోలో కొవిడ్ ఎమర్జెన్సీ : ఈసారి ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్

జపాన్ కరోనా వైరస్ డెల్టా వేరియంట్ (Delta Variant) విజృంభిస్తోంది. రోజురోజుకీ డెల్టా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. జూలై 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్ సమరం ప్రారంభం కానుంది.

Olympics Will Be Held Without Spectators After Tokyo Declares Covid 19 Emergency

Olympics without spectators : జపాన్ కరోనా వైరస్ డెల్టా వేరియంట్ (Delta Variant) విజృంభిస్తోంది. రోజురోజుకీ డెల్టా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. జూలై 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్ సమరం ప్రారంభం కానుంది. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఈసారి ఒలింపిక్స్ ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్వహకులు నిర్ణయించారు. ఈ విషయాన్ని టోక్యో ఒలింపిక్స్ 2020 అధ్యక్షురాలు Seiko Hashimoto వెల్లడించారు. ఒలింపిక్స్ గేమ్స్ ప్రత్యక్షంగా చూసేందుకు ముందుగానే టికెట్లు కొన్నవారికి అధ్యక్షురాలు సియాకో క్షమాపణలు చెప్పారు.

జపాన్‌లో డెల్టా వేరియంట్ తీవ్రంగా ఉందని.. ప్రజల సురక్షిత కోసం అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు జపాన్ ప్రధాని Seiko Hashimoto మీడియాకు వెల్లడించారు. ఈసారి ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. గతేడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ టోక్యో ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ నేపథ్యలో నిర్వాహకులు ఏడాది పాటు వాయిదా వేశారు. ఈసారి ఒలింపిక్స్ గేమ్స్ చాలా పరిమిత పార్మాట్ లోనే నిర్వహించనున్నారు.