PAK ex cricketer Shahid Afridi Drags IPL Into Fakhar Zaman Dismissal Controversy
Shahid Afridi : ఆసియాకప్ 2025లో భారత్ అదరగొడుతోంది. ఈ టోర్నీలో రెండు సార్లు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఆదివారం (సెప్టెంబర్ 21) జరిగిన మ్యాచ్‌లో పాక్ పై టీమ్ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్ ఔట్ వివాదంగా మారింది.
ఫకర్ జమాన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే.. సంజూ శాంసన్ అందుకున్న క్యాచ్ పై వివాదం నడుస్తోంది. ఇది ఔట్ కాదని పాక్ అంటోంది. శాంసన్ క్యాచ్ అందుకునే సమయంలో బంతి నేలను తాకిందని, ఆ తరువాత గ్లౌజులోకి వెళ్లిందని ఆరోపిస్తోంది.
Hardik Pandya : బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. హార్దిక్ పాండ్యాను ఊరిస్తున్న భారీ రికార్డు..
వాస్తవానికి సంజూ క్యాచ్ అందుకున్న సమయంలో ఫీల్డ్ అంపైర్ టీవీ అంపైర్ సాయం కోరాడు. పలు రిప్లేలు పరిశీలించిన అనంతరం ఔట్ అంటూ టీవీ అంపైర్ తెలిపాడు. బాల్ సంజూ వేళ్ల మీద పడినట్లుగా వీడియోలో కనిపిస్తున్నప్పటికి కూడా పాక్ ఆటగాళ్లు, మాజీలు దాన్ని ఓ పెద్ద వివాదం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పాక్ జట్టు ఈ విషయమై ఐసీసీకి ఫిర్యాదు చేసిందని, టీవీ అంపైర్ పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
Wickets ka 𝐇𝐀𝐑𝐃𝐈𝐊 swaagat, yet again 🤩
Hardik Pandya nicks one off Fakhar Zaman 🔥
Watch #INDvPAK LIVE NOW, on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/19fR5GiMn3
— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025
ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది కూడా ఈ క్యాచ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియా పై, ఐపీఎల్ ఉన్న అక్కసును మరోసారి అతడు వెళ్లగక్కాడు. ఆ అంపైర్ (టీవీ అంపైర్) ఐపీఎల్‌లో కూడా అంపైరింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకనే అతడు భారత్ పట్ల పక్షపాతంతో వ్యవహరించాడని చెప్పుకొచ్చాడు.
ఓ టీవీ చర్చాలో పాల్గొన్న మహ్మద్ యూసఫ్ కూడా ఫకర్ నాటౌట్ అని తెలిపాడు. ‘ఫకర్ మూడు ఫోర్లు కొట్టి మంచి ఊపులో ఉన్నాడు. తొలి ఓవర్‌లోనే అతడు బుమ్రాను చాలా సులభంగా ఎదుర్కొన్నాడు. భారత్‌కు అతడి వికెట్ ఎంతో కీలకం. అందుకనే వారు పలు కోణాల్లో కూడా పరిశీలించకుండానే ఔట్ ఇచ్చారు.’ అని అన్నాడు.