PAK vs BAN
ఏడు వికెట్ల తేడాతో పాక్ గెలుపు
బంగ్లాదేశ్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో పాక్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్తాన్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హక్ (78; 84 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (63 నాటౌట్; 79 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్) అర్థశతకాలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఇమామ్ ఉల్ హక్ ఔట్..
పాకిస్తాన్ మరో వికెట్ కోల్పోయింది. మిరాజ్ బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హక్ (78; 84 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ 159 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
ఇమామ్ ఉల్ హక్ హాఫ్ సెంచరీ
మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో (24.2వ ఓవర్) ఇమామ్ ఉల్ హక్ సిక్సర్ కొట్టి 61 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 25 ఓవర్లకు పాక్ స్కోరు 114/2. ఇమామ్ ఉల్ హక్ (55), మహ్మద్ రిజ్వాన్ (20) పరుగులతో క్రీజులో ఉన్నారు.
బాబర్ ఆజామ్ క్లీన్ బౌల్డ్..
పాకిస్తాన్ మరో వికెట్ కోల్పోయింది. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో (15.3వ ఓవర్) బాబర్ ఆజామ్ (17; 22 బంతుల్లో 1ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ 74 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లకు పాక్ స్కోరు 74/2. ఇమామ్ ఉల్ హక్ (36), మహ్మద్ రిజ్వాన్(0) లు క్రీజులో ఉన్నారు.
ఫఖర్ జమాన్ ఔట్
పాకిస్తాన్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. షారిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో (9.1వ ఓవర్) ఫఖర్ జమాన్ (20; 31 బంతుల్లో 3ఫోర్లు) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ 35 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లకు పాక్ స్కోరు 39/1. ఇమామ్ ఉల్ హక్ (15), బాబర్ ఆజామ్ (3) లు క్రీజులో ఉన్నారు.
ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు..
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగింది. ఓపెనర్లుగా ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ లు వచ్చారు. వీరిద్దరు ఆచి తూచి ఆడుతున్నారు. 5 ఓవర్లకు పాకిస్తాన్ స్కోరు 15/0. ఫఖర్ జమాన్ (13), ఇమామ్ ఉల్ హక్ (2) క్రీజులో ఉన్నారు.
బంగ్లాదేశ్ ఆలౌట్.. పాక్ ముందు స్వల్ప లక్ష్యం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. 38.4 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ (64; 87 బంతుల్లో 5 ఫోర్లు) షకీబ్ అల్ హసన్(53; 57 బంతుల్లో 7 ఫోర్లు) లు అర్థశతకాలతో రాణించగా మెహిదీ హసన్ మిరాజ్ (0), లిటన్ దాస్ (16), మహ్మద్ నయీమ్(20)లు విఫలం అయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రఫ్, ఇఫ్తికార్ అహ్మద్ లు తలా ఓ వికెట్ తీశారు. పాక్ ముందు 194 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.
షకీబ్ ఔట్.. ముష్ఫికర్ రహీమ్ హాఫ్ సెంచరీ
అర్థశతకం చేసిన కాసేపటికే ఫహీమ్ అష్రఫ్ (29.1వ ఓవర్) బౌలింగ్‌లో షకీబ్ అల్ హసన్(53; 57 బంతుల్లో 7 ఫోర్లు) ఫఖర్ జమాన్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 147 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అదే ఓవర్‌లోని మూడో బంతికి ముష్ఫికర్ రహీమ్ రెండు పరుగులు తీసి 71 బంతుల్లో హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 150/5. ముష్ఫికర్ రహీమ్ (50), షమీమ్ హుస్సేన్ (0) క్రీజులో ఉన్నారు.
షకీబ్ అల్ హసన్ అర్థశతకం
47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాదేశ్‌ను ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్ జోడి ఆదుకుంటోంది. ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో (27.1) సింగిల్ తీసి కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 53 బంతుల్లో 7 ఫోర్లతో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 28 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 142/4. ముష్ఫికర్ రహీమ్ (45) , షకీబ్ అల్ హసన్ (51) లు క్రీజులో ఉన్నారు.
తౌహిద్ హృదయ్ ఔట్
బంగ్లాదేశ్ మరో వికెట్ కోల్పోయింది. హరీస్ రవూఫ్ బౌలింగ్‌లో (9.1వ ఓవర్)లో తౌహిద్ హృదయ్(2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. 10 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 49/4. ముష్ఫికర్ రహీమ్(2), షకీబ్ అల్ హసన్(5) లు క్రీజులో ఉన్నారు.
మహ్మద్ నయీమ్ ఔట్
బంగ్లాదేశ్ మరో వికెట్ కోల్పోయింది. హరీస్ రవూఫ్ బౌలింగ్‌లో (7.3వ ఓవర్) మహ్మద్ నయీమ్(20; 25 బంతుల్లో 4ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 45 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
5 ఓవర్ల లోపే 2 వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాకులు తగిలాయి. పాక్ పేసర్ల ధాటికి 5 ఓవర్ల లోపే 2 వికెట్లు కోల్పోయింది. మొదట నసీమ్ షా బౌలింగ్‌లో (1.1వ ఓవర్)లో మెహిదీ హసన్ మిరాజ్ (0) డకౌట్ అయ్యాడు. మరికాసేపటికే షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో (4.5వ ఓవర్) లిటన్ దాస్ (16; 13 బంతుల్లో 4 ఫోర్లు) రిజ్వాన్ చేతికి చిక్కాడు. 5 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 31/2. షకీబ్ అల్ హసన్(0), మహ్మద్ నయీమ్(15) క్రీజులో ఉన్నారు.
పాకిస్థాన్ తుది జట్టు : ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
బంగ్లాదేశ్ తుది జట్టు : మహ్మద్ నయీమ్, మెహిదీ హసన్ మిరాజ్, లిట్టన్ దాస్, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), షమీమ్ హుస్సేన్, అఫీఫ్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్
ఆసియాకప్‌లో గ్రూప్ దశ ముగిసింది. టాప్-4 జట్లు సూపర్ 4లో అడుగుపెట్టాయి. సూపర్-4లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య లాహోర్‌లోని గఢాపీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.