Pakistan beat srilanka in Asia Cup 2025 super 4 stage
PAK vs SL : ఆసియా కప్ 2025 సూపర్-4 తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోయింది. మంగళవారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ (PAK vs SL) చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో శ్రీలంక జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్ర్కమించినట్లే. సాంకేతికంగా మాత్రమే ఆ జట్టు రేసులో ఉంది. ఆ జట్టు ఫైనల్ చేరుకోవాలంటే మహాద్భుతం జరగాల్సిందే. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచిన పాక్ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కమిందు మెండిస్ (50; 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు.
IND vs BAN : భారత్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం..!
మిగిలిన వారు ఘోరంగా విఫలం కావడంతో లంక జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. హరిస్ రవూఫ్, హుస్సేన్ తలాత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అబ్రాద్ అహ్మద్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (5), సైమ్ అయూబ్ (2)లు విఫలమైనా.. నవాజ్ (38 నాటౌట్; 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), తలాత్ (32 నాటౌట్; 30 బంతుల్లో 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ లు ఆడడంతో 134 పరుగుల లక్ష్యాన్ని పాక్ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. లంక బౌలర్లలో మహేశ్ తీక్షణ, వనిందు హసరంగ చెరో రెండు వికెట్లు తీశారు.