Pakistan Team
Champions Trophy: పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎనిమిది టీంలు ఈ టోర్నీకోసం తమ జట్లను ప్రకటించాయి. పాకిస్థాన్ గడ్డపై ఈ మెగాటోర్నీ జరుగుతున్నప్పటికీ.. భారత్ జట్టు ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. తొలి మ్యాచ్ ఈనెల 19న పాకిస్థాన్ -న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. దీంతో ఆ దేశంలోని క్రికెట్ అభిమానులు పాకిస్థాన్ జట్టుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: JioHotstar : ఐపీఎల్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. జియోలో ఫ్రీ స్ట్రీమింగ్ బంద్.. ఇకపై ఎంత కట్టాలంటే..
ఛాంపియన్స్ ట్రోఫీ మరో ఐదు రోజుల్లో పాకిస్థాన్ వేదికగా ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే, పాకిస్థాన్ వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు విజేతగా నిలిచి పాక్ జట్టుకు షాకిచ్చింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 49.3ఓవర్లలో 242 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ జట్టు 45.2 ఓవర్లలోనే కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి పాకిస్థాన్ జట్టును చిత్తుచేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు ఈ విజయం న్యూజిలాండ్ జట్టులో ఉత్సాహాన్ని రెట్టింపు చేయగా.. పాకిస్థాన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. సొంతగడ్డపై వన్డే సిరీస్ గెలవలేకపోయిన పాకిస్థాన్.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా రాణిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఈనెల 19న పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.
New Zealand cruise past Pakistan to clinch the Tri-Series title 🏆#PAKvNZ 📝: https://t.co/1AGfEbGry3 pic.twitter.com/O5ujDG4AkU
— ICC (@ICC) February 14, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టుపై ఆ దేశంలోని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘న్యూజిలాండ్ జట్టు విజేతగా అర్హులు. పాకిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణ ప్రదర్శన చేసింది’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘ఈ ఫన్నీ జట్టుతో మనం ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తున్నామా?’’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పాకిస్థాన్ జట్టుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Ghar main gus kar phr mar diya 😭
— Urooj Jawed🇵🇰 (@uroojjawed12) February 14, 2025
Well deserved. Pakistan Cricket Team is full of craps.
— Muhammad Irfan Malik (@MIrfanMalick) February 14, 2025