AUS vs PAK : బాల్‌లో బీసీసీఐ చిప్ పెట్టింది..! అందుకే పాక్ ఆట‌గాళ్లు ఇలా..

Australia vs Pakistan 1st Test : పెర్త్ వేదిక‌గా గురువారం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది.

పెర్త్ వేదిక‌గా గురువారం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ (164; 211 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) భారీ శ‌త‌కంతో చెల‌రేగ‌గా మిచెల్ మార్ష్ (90; 107 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌డంతో ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 487 ప‌రుగులు చేసింది. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో అమీర్ జమాల్ ఆరు వికెట్లు తీశాడు. ఖుర్రం షాజాద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రఫ్ లు చెరో వికెట్ సాధించారు.

కాగా.. పాకిస్తాన్ పేల‌వ ఫీల్డింగ్ కార‌ణంగానే ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. ఆసీస్ ఆట‌గాళ్లు ఇచ్చిన ప‌లు క్యాచ్‌ల‌ను పాక్ ఫీల్డ‌ర్లు జార‌విడిచారు. దీంతో నెటింట్ట పాక్ పీల్డ‌ర్ల‌పై ట్రోలింగ్ మొద‌లైంది. ముఖ్యంగా అబ్దుల్లా షఫీక్‌ క్యాచ్ జార‌విడిచే ఫోటోల‌ను షేర్ చేస్తూ ప‌లు మీమ్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. అయితే.. ఓ నెటిజ‌న్ మాత్రం పాక్ ఆట‌గాళ్లు క్యాచ్‌లు ప‌ట్ట‌క‌పోవ‌డానికి బీసీసీఐ కార‌ణం అంటూ విమ‌ర్శించాడు. బంతిలో బీసీసీఐ చిప్‌ను ఇన్‌స్టాల్ చేసింద‌ని రాసుకొచ్చాడు. దీన్ని చూసిన నెటిజ‌న్లు మీరు మార‌రు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

IND-W vs ENG-W Test : దీప్తిశ‌ర్మ సంచ‌ల‌న స్పెల్‌.. కుప్ప‌కూలిన ఇంగ్లాండ్‌.. భార‌త్‌కు భారీ ఆధిక్యం

ఆసీస్ ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్‌ను ఆమిర్‌ జమాల్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఓ బంతిని ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా పుల్ షాట్ ఆడేందుకు య‌త్నించాడు. అయితే బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అబ్దుల్లా ష‌ఫీక్ వెన‌క్కు ప‌రిగెత్తుకుంటూ వెళ్లి బంతిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. అత‌డి చేతుల్లోంచి బంతి కింద‌ప‌డింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Lionel Messi : మెస్సీనా మ‌జాకానా.. 6 జెర్సీల‌కు రూ.64 కోట్లు

ఆసీస్ మొద‌టి ఇన్నింగ్స్ అనంత‌రం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండు వికెట్లు కోల్పోయి 132 ప‌రుగులు చేసింది. ఇమామ్ ఉల్ హ‌క్ (38), ఖుర్రం షాజాద్ (7) క్రీజులో ఉన్నారు. ఆసీస్ మొద‌టి ఇన్నింగ్స్ ప‌రుగుల క‌న్నా పాకిస్తాన్ ఇంకా 355 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ చివ‌రి సారిగా ఆసీస్ గ‌డ్డ‌పై 1995లో టెస్టు సిరీస్ గెలిచింది. ఆ త‌రువాత మ‌రోసారి సిరీస్‌ను గెల‌వ‌లేదు.

ట్రెండింగ్ వార్తలు