Pakistan hockey in dire straits, PHF owes PKR 80 million to players and employees
Pakistan Hockey Federation : పాకిస్తాన్ హాకీ పెడరేషన్ (పీహెచ్ఎఫ్) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. గత ఆరు నెలలుగా హాకీ ఫెడరేషన్ తమ సిబ్బంది, ఆటగాళ్లకు జీతాలను చెల్లించడంలో విఫలమైంది. లాహోర్‌లోని ప్రధాన కార్యాలయం, కరాచీలోని సబ్-ఆఫీస్‌లోని పిహెచ్‌ఎఫ్‌లోని ఉద్యోగులందరూ గత ఆరు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా 80 మందికి పైగా ఆఫీస్, గ్రౌండ్ ఉద్యోగులకు ఫెడరేషన్ ద్వారా ఎటువంటి వైద్య ప్రయోజనాలు అందడం లేదని తెలుస్తోంది.
అంతేకాదు.. ఆటగాళ్లకు సైతం గత నాలుగు ఐదు నెలలుగా కాంట్రాక్టు జీతాలు లేదా అలవెన్సులు చెల్లించలేదని తెలుస్తోంది. ఒమన్‌లో ఇటీవల జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొన్నందుకు కూడా వారి కాంట్రాక్ట్ జీతాలు లేదా అలవెన్సులు చెల్లించలేదు. ఈ క్రమంలో కెప్టెన్ ఇమాద్ షకీల్ బట్ సహా కొందరు ఆటగాళ్లు క్వాలిఫయర్స్ జరుగుతున్న సమయంలో తమ రోజువారి బకాయిలు చెల్లించాలని జట్టు మేనేజ్‌మెంట్‌తో గొడవ పడ్డారట.
Viral Video : ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరూ! పక్షిలా గాల్లోకి ఎగిరి..
తమ రోజువారి బకాయిలను క్లియర్ చేసే వరకు తదుపరి మ్యాచులను ఆడబోమని బెదిరించినట్లు ఓ మూలం తెలిపింది. కాగా.. ఈ టోర్నీలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.
పీహెచ్ఎప్‌కు ప్రభుత్వం నిధులు ఇవ్వడం ఆపివేసిందని, అంతేకాకుండా దాని ఖాతాలను కూడా సస్పెండ్ చేసిందని నివేదిక సూచించింది. నిధుల ఆర్థిక దుర్వినియోగం పై విచారణ కొనసాగుతున్న కారణంగానే ఇలా చేసింది. ప్రస్తుతం పీహెచ్ఎఫ్.. ఉద్యోగులు, ఆటగాళ్లు, కోచ్‌లు, ఇతర క్లయింట్‌లకు కలిపి సుమారు 80 మిలియన్ రూపాయలు బకాలయిలు చెల్సించాల్సిన ఉందట.