ENG vs PAK : 6.4 ఓవ‌ర్ల‌లో 338 ప‌రుగులు.. బై బై పాకిస్థాన్.. మీమ్స్ వైర‌ల్

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ ప్ర‌యాణం దాదాపుగా ముగిసిన‌ట్లే.

Pakistan

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ ప్ర‌యాణం ముగిసిన‌ట్లే. సెమీస్ చేరాలంటే పాకిస్థాన్ 6.4 ఓవ‌ర్ల‌లో 338 ప‌రుగులు చేయాలి. అంటే 40 బంతుల్లో 338 ప‌రుగులు చేస్తే ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ సెమీస్ చేరుకుంటుంది. అన్ని బంతుల‌కు సిక్సులు బాదిన కానీ.. 240 ప‌రుగులే అవుతాయి. ఈ లెక్క‌న పాకిస్థాన్ సెమీస్ చేర‌కుండానే వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ నుంచి నిష్ర‌మించ‌డం ఖాయం.

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ కాకుండా 8 మ్యాచులు ఆడిన పాకిస్థాన్ నాలుగు మ్యాచులు గెలిచి, నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. కివీస్ త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో భారీ తేడాతో గెల‌వ‌డంతో పాకిస్థాన్ సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఇంగ్లాండ్‌తో మ్యాచ్లో మొద‌ట బ్యాటింగ్ చేస్తే 287 ప‌రుగులు, ల‌క్ష్యాన్ని ఛేద‌న అయితే 6.4 ఓవ‌ర్ల‌లో పాకిస్థాన్ పూర్తి చేయాల్సి వ‌చ్చింది.

Numerical Coincidence : క్రికెట్‌లో అరుదైన క్ష‌ణం.. శతాబ్దానికి ఒక్క‌సారే ఇలా.. 11/11/11న 11:11కి .. 111 ప‌రుగులు

టాస్ క‌లిసి రాలే..

కోల్‌త‌కా వేదిక‌గా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాల‌ని పాకిస్థాన్ బావించింది. అయితే.. అదృష్టం పాకిస్థాన్‌కు క‌లిసి రాలేదు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో బెన్‌స్టోక్స్ (84; 76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), జో రూట్ (60; 72 బంతుల్లో 4 ఫోర్లు), బెయిర్ స్టో(59; 61 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్‌) అర్ధ‌శ‌త‌కాలు బాదారు. మ‌ల‌న్ 31, హ్యారీ బ్రూక్ 30 ప‌రుగుల‌తో రాణించారు. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో హరీస్ రవూఫ్ మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇఫ్తికార్ అహ్మద్ ఓ వికెట్ సాధించాడు.

మీమ్స్ వైర‌ల్‌..

పాకిస్థాన్ సెమీస్ చేరే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో మీమ్స్ వైర‌ల్‌గా మారాయి. బై బై పాకిస్థాన్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ODI World Cup 2023 : 20 ఏళ్లుగా ప‌దిలంగా ఉన్న సచిన్ 673 రికార్డు.. కోహ్లి, డికాక్, రచిన్ కళ్లు..

ట్రెండింగ్ వార్తలు