×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా కీల‌క నిర్ణ‌యం.. పాక్ ప‌ర్య‌ట‌న‌..

ఫిబ్ర‌వ‌రి 7 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 (T20 World Cup 2026) ప్రారంభం కానుంది.

PAKISTAN TO HOST AUSTRALIA IN T20 WORLD CUP BUILD UP

T20 World Cup 2026 : ఫిబ్ర‌వ‌రి 7 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ప్రారంభం కానుంది. కాగా.. ఈ మెగా టోర్నీకి స‌న్న‌ద్దం కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మెగాటోర్నీకి (T20 World Cup 2026)ముందు పాకిస్తాన్‌లో ఆస్ట్రేలియా ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య పాక్ జ‌ట్టుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఇరు జ‌ట్లు కూడా ఈ సిరీస్‌ను టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కి స‌న్నాహ‌కంగా ఉప‌యోగించుకోనున్నాయి. ఈ విష‌యాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా తెలియ‌జేసింది.

జ‌న‌వ‌రి 29, 31, ఫిబ్ర‌వ‌రి 1 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లు అన్ని కూడా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలోనే జ‌ర‌గ‌నున్న‌ట్లు పీసీబీ తెలిపింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపికైన జ‌ట్టే ఈ ప‌ర్య‌ట‌న‌లోనూ పాల్గొంటుంద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇక ఈ ప‌ర్య‌ట‌న కోసం ఆసీస్ జ‌ట్టు జ‌న‌వ‌రి 28న లాహోర్‌కు చేరుకోనుంది.

RCB : పంచె క‌ట్టులో కోహ్లీ.. చీర‌లో స్మృతి మంధాన‌.. ఆర్‌సీబీ సంక్రాంతి విషెస్ పోస్ట‌ర్ అదుర్స్‌..

ఇక ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్ కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రారంభం అవుతాయి. కాగా.. ఆస్ట్రేలియా జట్టు 2022 మార్చిలో చివరిసారిగా పాక్‌లో పర్యటించింది.

భార‌త్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచ‌క‌ప్ 2026 ఫిబ్ర‌వ‌రి 7 నుంచి మార్చి 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. 20 జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ గ్రూప్‌-ఏలో ఉంది. ఇక ఆస్ట్రేలియా గ్రూప్‌-బిలో ఉంది.