Asia Cup 2023 : ఆసియాక‌ప్ నుంచి ఔట్‌ .. ఎన్ని టీవీలు ప‌గిలాయో..? నెట్టింట పాక్ పై జోకులు

ఆసియా క‌ప్ (Asia Cup) 2023లో ఫైన‌ల్ చేరాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ (Pakistan) జ‌ట్టు ఓట‌మి పాలైంది. ఫైన‌ల్ చేర‌డంలో విఫ‌ల‌మైన పాక్ పై సొంత అభిమానుల‌తో పాటు నెటీజ‌న్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

Fans Troll Pakistan

Asia Cup : ఆసియా క‌ప్ (Asia Cup) 2023లో ఫైన‌ల్ చేరాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ (Pakistan) జ‌ట్టు ఓట‌మి పాలైంది. కొలంబో వేదిక‌గా గురువారం శ్రీలంక‌ (Sri Lanka) తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచులో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ జ‌ట్టు ఫైన‌ల్ చేర‌కుండానే నిష్ర్క‌మించింది. శ్రీలంక 11వ సారి ఆసియా క‌ప్ ఫైన‌ల్ కు చేరింది. క‌ప్పు కోసం శ్రీలంక ఆదివారం భార‌త జ‌ట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.

Virat Kohli : వాట‌ర్‌ బాయ్‌గా మారిన కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆది నుంచే త‌డ‌బ‌డింది. మహ్మద్ రిజ్వాన్ (86 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (47) లు 108 ప‌రుగుల భాగ‌స్వామ్యంతో రాణించ‌డంతో 42 ఓవ‌ర్ల‌కు 7 వికెట్ల న‌ష్టానికి పాక్‌ 252 పరుగులు చేసింది. వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్‌ను 42 ఓవ‌ర్ల‌కు కుదించారు. కుశాల్ మెండిస్ (91), చరిత్ అసలంక (49 నాటౌట్), సదీర సమరవిక్రమ (48) లు రాణించ‌డంతో ఎనిమిది వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఆఖ‌రి బంతికి విజ‌యాన్ని అందుకుంది.

పాక్ పై ట్రోలింగ్‌..

శ్రీలంక పై ఓడిపోయి ఫైన‌ల్ చేర‌డంలో విఫ‌ల‌మైన పాక్ పై సొంత అభిమానుల‌తో పాటు నెటీజ‌న్లు ట్రోలింగ్ చేస్తున్నారు. టీవీలు ప‌గ‌ల‌డం స్టార్ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని టీవీలు ప‌గిలిపోయాయో అని ఓ నెటీజ‌న్ చేసిన కామెంట్ వైర‌ల్‌గా మారింది.

Chaminda Vaas: బుమ్రాలాంటి వారిని ఇన్ని ఫార్మాట్లలో ఆడించొద్దు.. ఎందుకంటే?: చమింద వాస్

కొలంబోలో ఒక థ్రిల్లర్. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. కానీ దహానీకి పెద్ద ఉపశమనం, అతను అన్‌ప్యాక్ చేయవలసిన అవసరం లేదు అని మ‌రో నెటీజ‌న్ ట్వీట్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు