Chaminda Vaas: బుమ్రాలాంటి వారిని ఇన్ని ఫార్మాట్లలో ఆడించొద్దు.. ఎందుకంటే?: చమింద వాస్

విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని మనకు తెలుసు. గత దశాబ్దకాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. రోహిత్ కూడా..

Chaminda Vaas: బుమ్రాలాంటి వారిని ఇన్ని ఫార్మాట్లలో ఆడించొద్దు.. ఎందుకంటే?: చమింద వాస్

Chaminda Vaas

Updated On : September 15, 2023 / 4:28 PM IST

Chaminda Vaas – Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యేకమైన టాలెంట్ ఉందని, అటువంటి ఆటగాడిని మూడు ఫార్మాట్లలో ఆడించకూడదని శ్రీలంక (Sri Lanka) మాజీ క్రికెటర్ చమింద వాస్ అన్నారు. 1996లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక జట్టులో చమింద వాస్ ఒకరు.

అద్భుత టాలెంట్ ఉన్న బుమ్రాలాంటి ఆటగాళ్లను మూడు ఫార్మాట్లలో కాకుండా ఏదో ఒక ఫార్మాట్ కి పరిమితం చేస్తే గాయాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందని, సుదీర్ఘకాలం పాటు క్రికెట్లో కొనసాగుతారని చెప్పారు. అటువంటి ఆటగాళ్ల విషయంలో భారత సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టి వారికి తగిన ఫార్మాట్లలో మాత్రమే ఆడించాలని అన్నారు.

బుమ్రాలాంటి వారిపై పడే పనిభారాన్ని సమర్థంగా నియంత్రించాలని చెప్పారు. సంప్రదాయబద్ధంగా కాకుండా ప్రత్యేకంగా బౌలింగ్ చేసే బుమ్రాలాంటి టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ఎలా వినియోగించుకోవాలన్న విషయం చాలా ముఖ్యమని అన్నారు.

వచ్చే వన్డే ప్రపంచ కప్‌ గురించి ఆయన మాట్లాడుతూ… ‘ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని మనకు తెలుసు. గత దశాబ్దకాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. రోహిత్ కూడా అంతే. భారత్ కోసం తమ సామర్థ్యాలను 100 శాతం వినియోగిస్తారు. వారిద్దరి ప్రదర్శన చూడడానికి అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు ’ అని చమింద వాస్ చెప్పారు.

Suryakumar Yadav turns 33 : టీ20ల్లో నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న సూర్య‌కుమార్ యాద‌వ్ గ‌ణాంకాలు ఇవే..