Pakistan vs Australia : పాక్‌తో ఆసీస్ మూడో టెస్టు.. స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు..!

Pakistan vs Australia : పాకిస్తాన్‌లో ఆస్ట్రేలియా రికార్డుల మోత మోగిస్తోంది. మూడో టెస్టులో ఆసీస్ జట్టు స్మిత్ 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

Pakistan vs Australia : పాకిస్తాన్‌లో ఆస్ట్రేలియా రికార్డుల మోత మోగిస్తోంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ జట్టు దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ఆటగాళ్లు బ్యాట్ ఝళిపించారు. లాహోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డును సాధించాడు. మూడో టెస్టులో స్మిత్ 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర కన్నా వేగంగా 8000 టెస్టు పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. లాహోర్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ఈ మైలురాయిని చేరుకోవడానికి సంగక్కర 152 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. స్మిత్ తన 151వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు. సంగక్కర 91తో పోల్చితే ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్మిత్ ఈ ఫీట్ సాధించడానికి కేవలం 85 మ్యాచ్‌లు మాత్రమే తీసుకున్నాడు. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ మైలురాయిని అందుకోవడానికి 154 నాక్స్ తీసుకున్నాడు. పాక్ తో జరిగే టెస్టు మ్యాచ్‌లో స్మిత్ 59, 27 స్కోర్‌లను నమోదు చేయడంతో ఆస్ట్రేలియా సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు 351 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.


స్మిత్‌తో పాటు ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్ అలెక్స్ కారీల హాఫ్ సెంచరీలతో మొదటి ఇన్నింగ్స్‌లో 391 పరుగుల స్కోరు అందించారు. షాహీన్ ఆఫ్రిది, నసీమ్ షా తలో వికెట్ తీశారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసిన ఖవాజా.. సిరీస్‌లో తన రెండవ సెంచరీని సాధించాడు. ఆస్ట్రేలియా రెండవ బ్యాటింగ్‌లో 104 పరుగులతో నాటౌట్‌గా ముగించాడు. అయితే డేవిడ్ వార్నర్ 51 పరుగులతో రాణించడంతో ఆసీస్ జట్టు 227/3తో డిక్లేర్ చేసింది. దాంతో పాక్ జట్టుకు 351 పరుగులను నిర్దేశించింది.

ఆసీస్ బౌలర్లలో కమిన్స్ ఐదు వికెట్లు పడగొట్టగా, స్టార్క్ నాలుగు వికెట్లు తీశాడు. పాకిస్తాన్ 4వ రోజు స్టంప్స్ వద్ద 73/0కి చేరుకుంది. పాక్ మూడో టెస్టులో విజయానికి ఇంకా 278 పరుగులు చేయాల్సి ఉంది. ఇమామ్ ఉల్ హక్ 42, అబ్దుల్లా షఫీక్ 27 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ఇప్పటికే మొదటి రెండు టెస్టుల్లో మ్యాచ్ కోల్పోయిన ఆసీస్.. మూడో టెస్టులో గెలుపు కోసం ఆరాటపడుతోంది. ముచ్చటగా మూడో టెస్టులోనూ విజయం కోసం పాక్ ఉవ్విళ్లూరుతోంది. మూడో టెస్టులో ఎవరిది పైచేయి కానుందో చూడాలి.

Read Also : Steve Smith: పాకిస్తాన్‌లో చాలా సేఫ్‌గా అనిపిస్తుంది

ట్రెండింగ్ వార్తలు