Rishabh Pant
Rishabh Pant Health: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్ లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్న పంత్‌కు వైద్య చికిత్స అందిస్తున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో కుడి మోకాలి లిగ్మెంట్ సర్జరీ చేయించుకున్న పంత్ వాకింగ్ స్టిక్ సహాయంతో మెల్లగా నడక మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను పంత్ తన సోసల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. దీనికి శీర్షికగా.. ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా.. ఒక అడుగు మెరుగ్గా అని పేర్కొన్నాడు. ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు పంత్ త్వరగా కోరుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
Kapil-Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకున్నాక చెంపదెబ్బ కొడతా: కపిల్ దేవ్ వ్యాఖ్యలు
పంత్ ఒక్కో అడుగు నడక ప్రారంభిస్తున్నట్లు ఫొటోను షేర్ చేయడంతో.. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించారు. పంత్ త్వరగా కోలుకోవాలని, హృదయపూర్వక సందేశాలను పోస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మొదటి టెస్టులో ఆడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 30 పంత్ రోడ్డు ప్రమాదలో గాయపడ్డాడు. స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ హరిద్వార్ – ఢిల్లీ హైవేపై పంత్ ప్రయాణిస్తున్నాడు. కారు వేగంగా డ్రైవ్ చేయడంతో రోడ్డు డివైడర్‌ను పంత్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పంత్ కారుకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.. అయితే పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు.
One step forward
One step stronger
One step better pic.twitter.com/uMiIfd7ap5— Rishabh Pant (@RishabhPant17) February 10, 2023
దీనిని గమనించిన స్థానికులు పంత్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వెంటనే డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. కొద్దిరోజుల తరువాత బీసీసీఐ పంత్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించింది. ఇటీవల పంత్ మోకాలి లిగ్మెంట్ శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం పంత్ ఊతకర్ర సహాయంతో ఒక్కో అడుగు వేస్తూ తన నడకను ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంత్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.