Kapil-Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకున్నాక చెంపదెబ్బ కొడతా: కపిల్ దేవ్ వ్యాఖ్యలు

రిషబ్ పంత్ గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ... "అతడంటే నాకు చాలా ఇష్టం. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రిషబ్ కోలుకోగానే అతడి వద్దకు వెళ్లి చెంపదెబ్బ కొడతా. మన గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతా. రిషబ్ పంత్ కు అయిన గాయాల వల్ల టీమిండియా కాంబినేషన్ మొత్తం నాశనం అయింది. ఇప్పటి యువత పొరపాట్లు ఇటువంటి పొరపాట్లు ఎందుకు చేస్తారన్న ఆగ్రహం నాలో ఉంది" అని చెప్పారు.

Kapil-Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకున్నాక చెంపదెబ్బ కొడతా: కపిల్ దేవ్ వ్యాఖ్యలు

India-Pakistan match

Kapil-Rishabh Pant: కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోలుకున్నాక అతడిని చెంపదెబ్బ కొడతానని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. రిషబ్ పంత్ కొన్ని వారాల క్రితం ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పంత్ కు ఇప్పటికే ఆసుపత్రిలో రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. త్వరలోనే మరో శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. పంత్ కారును నిద్రమత్తులో వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ఆరోపణలు వచ్చాయి.

రిషబ్ పంత్ గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ… “అతడంటే నాకు చాలా ఇష్టం. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రిషబ్ కోలుకోగానే అతడి వద్దకు వెళ్లి చెంపదెబ్బ కొడతా. మన గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతా. రిషబ్ పంత్ కు అయిన గాయాల వల్ల టీమిండియా కాంబినేషన్ మొత్తం నాశనం అయింది.

ఇప్పటి యువత పొరపాట్లు ఇటువంటి పొరపాట్లు ఎందుకు చేస్తారన్న ఆగ్రహం నాలో ఉంది” అని కపిల్ దేవ్ అన్నారు. కాగా, క్రికెట్లో బాగా రాణిస్తున్న పంత్ వంటి బ్యాట్స్ మన్, వికెట్ కీపర్ ప్రపంచ కప్ ముందు టీమిండియాలో లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. పంత్ కు అయ్యే చికిత్స ఖర్చు అంతా ఉత్తరాఖండ్ ప్రభుత్వం భరిస్తోంది.

PM Modi: మధ్య తరగతి అవసరాలకు ఆయిల్-గ్యాస్ రంగం అత్యంత కీలకం.. ప్రధాని మోదీ