PM Modi: మధ్య తరగతి అవసరాలకు ఆయిల్-గ్యాస్ రంగం అత్యంత కీలకం.. ప్రధాని మోదీ
మనం ఇంధన భద్రత గురించి మాట్లాడుతున్నప్పుడు, మరీ ముఖ్యంగా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన దేశాల కోణం నుంచి మాట్లాడాల్సి ఉంది. భారతదేశం లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి రోజూ 60 మిలియన్ల మంది పెట్రోల్ పంపులకు తమ వాహనాలలో ఇంధనం నింపుకోవడానికి వెళ్తుంటారు. ఇక్కడ రోజుకు ఐదు మిలియన్ క్రూడ్ ఆయిల్స్ బ్యారెల్స్ వినియోగం జరుగుతుంది. ఇంధన భద్రత అత్యంత కీలకం

PM Modi: స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను సృష్టించినప్పటికీ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి ఆయిల్-గ్యాస్ రంగం అత్యంత కీలకమైన పాత్రను పోషించనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇండియాన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరులో మంగళవారం జరిగిన ఇండియా ఎనర్జీ వీక్-2023లో అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుత మధ్య తరగతికి చెందిన కోట్లాది మంది ప్రజల అవసరాలను అందుకోవడానికి నిరాటంకంగా చమురు, సహజవాయువు సరఫరా అవసరం ఉందని అన్నారు.
Plastics Exhibition: విజయవంతంగా ముగిసిన ప్రపంచంలో అతిపెద్ద ప్లాస్టిక్స్ ప్రదర్శన
ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ‘‘మనం ఇంధన భద్రత గురించి మాట్లాడుతున్నప్పుడు, మరీ ముఖ్యంగా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన దేశాల కోణం నుంచి మాట్లాడాల్సి ఉంది. భారతదేశం లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి రోజూ 60 మిలియన్ల మంది పెట్రోల్ పంపులకు తమ వాహనాలలో ఇంధనం నింపుకోవడానికి వెళ్తుంటారు. ఇక్కడ రోజుకు ఐదు మిలియన్ క్రూడ్ ఆయిల్స్ బ్యారెల్స్ వినియోగం జరుగుతుంది. ఇంధన భద్రత అత్యంత కీలకం’’ అని అన్నారు.
Coin Vending Machine: కాయిన్లకు ప్రత్యేకంగా ఏటీఎం.. నోట్లే కాదు, ఇక నాణేలు కూడా ఎనీ టైం తీసుకోవచ్చు
‘ధరలు మరియు సరఫరా ఒడిదుడుకులను పరిష్కరించడంలో అంతర్జాతీయ ఇంధన భద్రత ఆవశ్యకత’ అనే అంశంపై ఒపెక్ సెక్రటరీ జనరల్ హరితమ్ అల్ ఘాయిస్ మాట్లాడుతూ చమురు అన్వేషణ, ఉత్పత్తి రంగానికి 12 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు 2045 నాటికి అవసరమని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ రంగంలో పెట్టుబడులు క్షీణించడం వల్ల ఉత్పత్తి 6% తగ్గిందన్నారు. ఉద్గారాలను తగ్గించే దిశగా మనమంతా కృషి చేస్తున్న వేళ ఇంధన భద్రత కూడా కావాల్సి ఉందని హరితమ్ అన్నారు.