పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు షాక్.. వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు

ఆమె ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

Wrestler Vinesh Phogat

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఫైనల్ చేరిన భారత రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో ఆమె పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఆమె నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు బరువు పెరగడంతో ఆమెపై వేటు వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె గత రాత్రి నిద్రకూడాపోకుండా కసరత్తులు చేసినా ఫలితం లేకపోయింది.

మంగళవారం గూజ్​మన్ (క్యూబా)తో వినేశ్ సెమీఫైనల్​లో తలపడి 5-0తో నెగ్గింది. దీంతో ఒలింపిక్స్​లో రెజ్లింగ్​లో ఫైనల్​ చేరుకున్న తొలి భారత మహిళా నిలిచింది. ఇంతలోనే వినేశ్ ఫొగాట్ డిస్క్వాలిఫై అయింది. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ధ్రువీకరించింది. కొన్ని గ్రాముల బరువు పెరగడంతో ఆమెపై వేటు పడిందని తెలిపింది. ఆమె ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేసింది.

అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో వినేశ్ ఫోగాట్ ఇవాళ అమెరికా ఆన్ సారా హిల్డెబ్రాండ్ తో తలపడేది. రెజ్లింగ్ లో భారత్ స్వర్ణం గెలుస్తుందని దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పతకం పొందే అవకాశాన్ని అనర్హత కారణంగా కోల్పోయింది వినేశ్. ఊహించని పరిణామంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

 Also Read.. నేడు మనవాళ్ల షెడ్యూల్ ఇదిగో..

ట్రెండింగ్ వార్తలు