Paris Olympics 2024 Day: నీరజ్ చోప్రా స్వర్ణం సాధిస్తాడా? నేటి భారత షెడ్యూల్ ఇదే..

పురుషుల జావెలిన్ త్రో ఫైనల్: నీరజ్ చోప్రా– రాత్రి 11.55 గంటలకు..

Neeraj Chopra

పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇవాళ భారత్‌కు బిగ్ డే. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇవాల జరిగే జావెలిన్ త్రో ఫైనల్స్ ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. ఇవాళ రాత్రి 11.55 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో గెలిచి స్వర్ణ పతకంతో భారత్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

దీంతో అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల భారీ త్రోతో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అతడిని ఇతర ఏ జావెలిన్ త్రోయర్ కూడా అంతకంటే ఎక్కువగా త్రో చేయలేదు. మరోవైపు, కాంస్య పతకం కోసం ఇవాళ భారత హాకీ జట్టు తలపడనుంది.

నేడు మనవాళ్లు ఆడే ఆటలు..

గోల్ఫ్

  • మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే రౌండ్ 2: అదితి అశోక్, దీక్షా దాగర్ – మధ్యాహ్నం 12.30 గంటలకు

అథ్లెటిక్స్

  • మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపెచేజ్ రౌండ్ (హీట్ 1): జ్యోతి యర్రాజి – మధ్యాహ్నం 2.05 గంటలకు
  • పురుషుల జావెలిన్ త్రో ఫైనల్: నీరజ్ చోప్రా– రాత్రి 11.55 గంటలకు

రెజ్లింగ్

  • పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రౌండ్ 16: అమన్ సెహ్రావత్ – మధ్యాహ్నం 2.30 గంటలకు
  • పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత సాధిస్తే): అమన్ సెహ్రావత్ – సాయంత్రం 4.20 గంటలకు
  • పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ సెమీ ఫైనల్స్ (అర్హత సాధిస్తే): అమన్ సెహ్రావత్ – రాత్రి 9.45 గంటలకు
  • మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్ రౌండ్ 16: అన్షు మాలిక్ – మధ్యాహ్నం 2.30 గంటలకు
  • మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత సాధిస్తే): అన్షు మాలిక్ – సాయంత్రం 4.20 గంటలకు
  • మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్ సెమీ-ఫైనల్ (అర్హత సాధిస్తే): అన్షు మాలిక్ – రాత్రి 10.25 గంటలకు

హాకీ

  • పురుషుల కాంస్య పతకం కోసం: భారత్ వర్సెస్ స్పెయిన్ – సాయంత్రం గంటలకు

 Also Read: రెజ్లింగ్‌కు గుడ్ బై అంటూ వినేశ్ ఫొగట్ ట్వీట్.. భావోద్వేగభరిత కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు