రెజ్లింగ్‌కు గుడ్ బై అంటూ వినేశ్ ఫొగట్ ట్వీట్.. భావోద్వేగభరిత కామెంట్స్

అందరికీ తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, తనను క్షమించాలని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

రెజ్లింగ్‌కు గుడ్ బై అంటూ వినేశ్ ఫొగట్ ట్వీట్.. భావోద్వేగభరిత కామెంట్స్

Wrestler Vinesh Phogat

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పింది. ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ ఫైనల్ ముందు అధిక బరువుతో అనర్హత వేటుకి గురికావడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది ఆమె. తన రిటైర్మెంట్ పై ఎక్స్ లో వినేశ్ ఫొగట్ పోస్టు చేసింది.

‘నాపై రెజ్లింగ్.. మ్యాచ్ గెలిచింది. నేను ఓడిపోయాను.. నా ధైర్యాన్ని కోల్పోయాను. నాకు ఇక శక్తిలేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024..’ అని ఆమె చెప్పింది. అందరికీ తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, తనను క్షమించాలని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఫొగట్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాను సిల్వర్ మెడల్‌కు అర్హురాలినని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై తీర్పును వెలువడించాల్సి ఉంది. పతకానికి అడుగు దూరంలో వినేశ్‌ ఫొగట్‌కు ఎదురుదెబ్బ తగలడంతో కోట్లాదిమంది భారతీయులు నిరాశ చెందారు.

వినేశ్ ఫొగట్ 50 కేజీల విభాగంలో పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే, వినేశ్ నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు పెరగడంతో ఆమెపై ఆమె వేటు వేశారు. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ధ్రువీకరించింది. వినేశ్ ఫొగట్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేసింది.

Also Read : వినేశ్ ఫోగ‌ట్ అన‌ర్హ‌త పై సైనా నెహ్వాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఆ ఇద్దరే చెప్పాలి..