రిటైర్మెంట్ ప్రకటించిన పార్థివ్ పటేల్

  • Publish Date - December 9, 2020 / 12:04 PM IST

Parthiv Patel Retires: భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ 35 సంవత్సరాల వయసులో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. చివరిగా 2018లో టీమ్ ఇండియా తరఫున ఆడిన పార్థివ్ పటేల్.. అన్నీ ఫార్మట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. పార్థివ్ పటేల్ 2002లో ఇంగ్లాండ్ పర్యటనలో 17సంవత్సరాల వయసులో భారత జట్టులోకి అడుగుపెట్టగా.. ఐపీఎల్‌లో RCB జట్టు తరుపున ఆడుతున్నాడు. అయితే ఈ ఏడాది పార్థివ్ పటేల్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు.



ఈ సంధర్భంగా ట్వీట్ చేసిన పార్థివ్ పటేల్.. “నా 18 సంవత్సరాల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. నన్ను బీసీసీఐ నమ్మినప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు.. ఆ సమయంలో టీమ్ ఇండియా తరఫున ఆడే అవకాశం ఇచ్చింది బిసిసిఐ. నాకు ఆ వయస్సులో సపోర్ట్ ఇచ్చినందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతాను. ” అని అన్నారు.


భారత జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించిన అందరికీ పార్థివ్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. సౌరవ్ గంగూలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కెప్టెన్‌గా, గంగూలీ ఎప్పుడూ నాకు సపోర్ట్ చేశాడు. “ఆయనతో ఆడటం నాకు గొప్ప విషయం.” అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చారు. అయితే భారత క్రికెటర్‌గా పార్థివ్‌ పటేల్‌కు దక్కాల్సిన గౌరవం పూర్తిగా దక్కలేదని అభిమానులు అంటున్నారు. కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా తనలో టాలెంట్‌ ఉన్నా సరైన గౌరవం ఇవ్వలేదని అంటారు.

ట్రెండింగ్ వార్తలు