Semi Final Pitch Controversy
వాంఖడే మైదానంలో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్ పై వివాదం చెలరేగుతోంది. భారత్, న్యూజిలాండ్ జట్లు వాంఖడే వేదికగా మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. అయితే.. ఈ మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఓ ఆంగ్ల పత్రిక భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పై సంచలన ఆరోపణలు చేసింది. సెమీ ఫైనల్ కోసం ముందుగా అనుకున్న పిచ్‌ను కాకుండా మరో పిచ్‌ను సిద్ధం చేసినట్లు డైలీమెయిల్ తెలిపింది.
సెమీ ఫైనల్ మ్యాచ్‌కు కొత్త పిచ్‌ను ఉపయోగించాలని మొదట అనుకున్నారని, అయితే.. ఈ మెగా టోర్నీలో రెండు మ్యాచులు ఆడిన పిచ్‌పైనే మ్యాచ్‌ను నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. గత రెండు మ్యాచుల్లో ఈ పిచ్ పై స్పిన్నర్లు రాణించడంతోనే ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉండేందుకు ఇలా చేసిందని ఆరోపించింది. పిచ్‌ను మార్చాలని అనుకున్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అయితే బీసీసీఐ మాత్రం ఆ పని చేయలేదని తెలిపింది.
పిచ్ వివాదంపై ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్..
అతిథ్య జట్టుకు అనుకూల పిచ్‌లను రూపొందించుకుందని బీసీసీఐ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పిచ్ వివాదం పై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు. ఐసీసీ పై తమకు నమ్మకం ఉందని చెప్పాడు. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు తాము ఎలాంటి సమస్యను ఎదుర్కొన లేదని చెప్పాడు. ఆ వార్తలను తాను చూశానని అన్నాడు. ఐసీసీలో ఒక స్వతంత్ర పిచ్ క్యూరేటర్ ఉంటారని, అతడు రెండు జట్లకు న్యాయం జరిగేలా చూసుకుంటారని ఖచ్చితంగా తాను అనుకుంటున్నట్లు చెప్పాడు.
కాగా.. రెండో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం ఈ మ్యాచ్ జరగనుంది.
Rohit Sharma : క్రిస్‌గేల్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు