Rohit Sharma : క్రిస్‌గేల్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు
Rohit Sharma- Chris Gayles : భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్ల బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.

Rohit Sharma
Rohit Sharma- Chris Gayles : భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్ల బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన తరువాత రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్ రికార్డును బ్రేకులు వేశాడు. వన్డే ప్రపంచకప్‌లలో 34 ఇన్నింగ్స్‌ల్లో గేల్ 49 సిక్సులు కొట్టగా రోహిత్ శర్మ కేవలం 27 ఇన్నింగ్స్‌ల్లోనే 50 సిక్సర్లు బాదడం విశేషం.
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..
రోహిత్ శర్మ (భారత్) – 51* సిక్సర్లు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 49 సిక్సర్లు
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 43 సిక్సర్లు
ఏబీ డివిలియర్స్ (దక్షిణాప్రికా) – 37 సిక్సర్లు
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 37 సిక్సర్లు
Also Read : మన వెంకీతో ఉన్న ఈ దిగ్గజ క్రికెటర్ ఎవరో మీకు తెలుసా..?
? Milestone Alert ?
Captain Rohit Sharma has now hit the most sixes in Men’s ODI World Cup ?#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/rapyuF0Ueg
— BCCI (@BCCI) November 15, 2023
ఓ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు..
రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఓ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ రికార్డు కూడా గేల్ పేరిట ఉండగా దాన్ని బద్దలు కొట్టాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో గేల్ 26 సిక్సర్లు కొట్టగా.. తాజాగా రోహిత్ అతడిని అధిగమించాడు.
ఓ వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
రోహిత్ శర్మ (భారత్)- 28 సిక్సర్లు – 2023 ప్రపంచకప్
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 26 సిక్సర్లు – 2015 ప్రపంచకప్
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) – 22 సిక్సర్లు – 2019 ప్రపంచకప్
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) 22 సిక్సర్లు – 2023 ప్రపంచకప్
ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) – 21 సిక్సర్లు – 2015 ప్రపంచకప్
క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) 21 సిక్సర్లు – 2023 ప్రపంచకప్
Also Read : ఐశ్వర్య రాయ్‌కు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ క్షమాపణలు
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 29 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 47 పరుగులు సాధించాడు.