Aishwarya Rai : ఐశ్వర్య రాయ్‌కు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ క్షమాపణలు
భారత బాలీవుడ్ ప్రముఖ సినీనటి ఐశ్వర్యారాయ్ ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ క్షమాపణలు చెప్పారు. రజాక్ చేసిన వ్యాఖ్యలు పాక్, భారత దేశాల్లోని పలువురు క్రికెటర్లు ఖండించారు.....

Aishwarya Rai,Abdul Razzaq
Aishwarya Rai : భారత బాలీవుడ్ ప్రముఖ సినీనటి ఐశ్వర్యారాయ్ ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ క్షమాపణలు చెప్పారు. రజాక్ చేసిన వ్యాఖ్యలు పాక్, భారత దేశాల్లోని పలువురు క్రికెటర్లు ఖండించారు.
ALSO READ : Karnataka : పరీక్ష హాలులో బాలికలు హిజాబ్ ధరించడంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఏం చెప్పారంటే….
‘‘నా పేరు అబ్దుల్ రజాక్. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మేం క్రికెట్ కోచింగ్ గురించి చర్చించాం. నేను నోరు జారి పొరపాటున ఐశ్వర్య రాయ్ పేరు తీసుకున్నాను. నేను ఐశ్వర్య రాయ్ కు వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతున్నాను. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. నేను వేరే ఉదాహరణ చెప్పవలసి వచ్చింది, కానీ ఆమె పేరును తప్పుగా ఉపయోగించాను’’ అని వైరల్ అయిన 27 సెకన్ల క్షమాపణ వీడియోలో అబ్దుల్ రజాక్ చెప్పారు.
ALSO READ : IMD Issues Warning : బంగాళాఖాతంలో అల్పపీడనం…ఆంధ్రా మత్స్యకారులకు ఐఎండీ హెచ్చరిక
తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదని రజాక్ పేర్కొన్నారు. ఐశ్వర్యారాయ్‌పై పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ అనుచిత, అసందర్భ వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ రజాక్ అసందర్భంగా ఐశ్వర్యారాయ్ పేరును తీసుకొచ్చాడు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ జట్టు ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టుపై విమర్శలు వచ్చాయి.
ALSO READ : Gold Rate Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్ .. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?
ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్ పాక్ జట్టు గురించి మాట్లాడాడు. ‘‘క్రికెట్‌ను మెరుగుపర్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏమాత్రం లేదు. అలాంటప్పుడు అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయి? నేను ఐశ్వర్యారాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు కదా. ఇది కూడా అంతే. బోర్డు సంకల్పం బలంగా ఉంటేనే మంచి ఫలితాలు సాధ్యం అవుతాయి’’ అని రజాక్ అన్నాడు. అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
https://twitter.com/AbdulRazzaq_PAK/status/1724485972862345283