IMD Issues Warning : బంగాళాఖాతంలో అల్పపీడనం…ఆంధ్రా మత్స్యకారులకు ఐఎండీ హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం పలు ప్రాంతాల్లో భారీ గాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు....

IMD Issues Warning : బంగాళాఖాతంలో అల్పపీడనం…ఆంధ్రా మత్స్యకారులకు ఐఎండీ హెచ్చరిక

Bay of Bengal low pressure

IMD Issues Warning : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం పలు ప్రాంతాల్లో భారీ గాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావం వల్ల బుధ, గురువారాల్లో సముద్ర తీరప్రాంతాల్లో భారీగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారిణి సునంద చెప్పారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ అధికారులు సూచించారు.

ALSO READ : Gold Rate Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్ .. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?

బంగాళా ఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని, దీనివల్ల తుపాన్ హెచ్చరికను విశాఖపట్టణం ఐఎండీ అధికారులు జారీ చేశారు. ఈ తుపాన్ ప్రభావం వల్ల ఒడిశా సముద్రతీరంలోని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ హెచ్చరించింది. మత్స్యకారులు నవంబర్ 17వతేదీ వరకు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.

ALSO READ : Earthquake : లద్దాఖ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్ర 4.4 గా నమోదు

తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాతాల్లో బుధవారం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కడలూర్, మైలాదుతురాయ్, నాగపట్టణం, తిరువారూర్, పుదుచ్చేరిలోని కరైకల్, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్ పట్టు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు.

ALSO READ : Subrata Roy : సహారా గ్రూప్ వ్యవస్థాపకులు సుబ్రతా రాయ్ కన్నుమూత…కేవలం రూ.2వేలతో వ్యాపారాన్ని ప్రారంభించి కోట్లకు అధిపతి అయ్యారు

తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఐఎండీ బుధవారం ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు వివరించారు. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూర్ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. పుదుచ్చేరిలోనూ విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు.