Venkatesh : మన వెంకీతో ఉన్న ఈ దిగ్గజ క్రికెటర్ ఎవరో మీకు తెలుసా..?
Venkatesh met VIV Richards : మన దేశంలో క్రికెట్‌ను ఓ ఆటలా కాదు ఓ మతంలా భావిస్తారు. టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్‌కు క్రికెట్ పై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Venkatesh met VIV Richards
మన దేశంలో క్రికెట్‌ను ఓ ఆటలా కాదు ఓ మతంలా భావిస్తారు. సినీ, రాజయకీయ ప్రముఖులు సైతం క్రికెట్ మ్యాచులను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక మన టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్‌కు క్రికెట్ పై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమ్ఇండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా సరే అక్కడకు వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్‌ను చూస్తూ ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. అలాంటిది వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లకుండా ఉంటారా.. చెప్పండి..
వన్డే ప్రపంచకప్ మెగాటోర్నీలో భారత జట్టు వరుస విజయాలతో దూసుకువెలుతోంది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఓటమే ఎగురని జట్టుగా సెమీస్‌కు వచ్చింది. వాంఖడే వేదికగా నేడు (బుధవారం నవంబర్ 15న) సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 2019లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులతో పాటు పెద్ద ఎత్తున సెలబ్రిటీలు సైతం వాంఖడే మైదానానికి చేరుకున్నారు. క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ సైతం ఇండియా, కివీస్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ఆయనతో కలిసి నటుడు విక్టరీ వెంకటేష్ సెల్పీ దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దిగ్గజం వివ్ రిచర్డ్స్‌తో కలిసి భారత్, కివీస్ సైమీఫైనల్ మ్యాచ్ చూడడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Delighted to be with the legendary Viv Richards at the #IndvsNZ Semi-final ?❤️ pic.twitter.com/6A5MvqRZrn
— Venkatesh Daggubati (@VenkyMama) November 15, 2023