Ratan Tata : రతన్‌ టాటాకు క్రీడా లోకం నివాళులు.. అసలైన భారత రతనాన్ని కోల్పోయాం..

దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచివేస్తోంది.

Pay Tribute as sporting world mourns passing of Ratan Tata

Ratan Tata : దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచివేస్తోంది. అనారోగ్య సమస్యల కారణంగా ముంబయి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ బుధ‌వారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. ప‌లువురు క్రీడా ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.

స‌చిన్ టెండూల్క‌ర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌, ఒలింపిక్ ప‌త‌క విజేత నీర‌జ్ చోప్రా త‌దిత‌రులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేశారు. ర‌త‌న్ టాటాను కోల్పోవ‌డం స‌మాజానికే తీవ్ర న‌ష్టం అని అన్నారు.

‘ర‌త‌న్ టాటా మ‌ర‌ణం దేశాన్ని క‌లిచివేస్తోంది. నేను ఆయ‌న‌తో సమయం గడపడం నా అదృష్టం. కానీ ఆయ‌న్ని ఎప్పుడూ కలవని లక్షలాది మంది ఈ రోజు నేను అనుభవించే అదే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. మీ విలువలు, మీరు నిర్మించిన సంస్థలు ద్వారా మీ వారసత్వం ఎప్ప‌టికి కొన‌సాగుతోంది. మీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి.’ అని స‌చిన్ అన్నారు.

మన దేశం గర్వించదగ్గ దిగ్గజం మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఒక తరం ముగిసినట్లు అనిపిస్తోంది. దేశం కోసం రతన్‌ టాటా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ప్రతి ఒక్కరికీ మార్గదర్శకులుగా నిలిచిపోయారు. నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని వీవీఎస్ ల‌క్ష్మణ్ ట్వీట్ చేశారు.