PSL: మహిళల కోసం పాకిస్తాన్ సూపర్ లీగ్

పాకిస్తాన్ మహిళా సూపర్ లీగ్‌ స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో జాతీయ జట్టు పేలవ ప్రదర్శనతో..

Women Psl

Pakistan Super League: పాకిస్తాన్ మహిళా సూపర్ లీగ్‌ స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో జాతీయ జట్టు పేలవ ప్రదర్శనతో ముగించింది. ఆందోళనకు గురైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా దీనిని అధిగమనించేందుకు సరైన దేశీయ సెటప్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోందని, ఇందులో టి20 ఫ్రాంచైజీ ఆధారిత లీగ్ కూడా ఉన్నట్లు తెలిపారు.

‘మహిళల క్రికెట్ సెటప్‌లో చాలా మార్పులు చేయాల్సి ఉంది. క్రీడలలో మహిళలకు ప్రత్యేకమైన పరిమితులు, ఇతర సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి. మూడు రోజుల మ్యాచ్‌లతో మహిళలకు సరైన షెడ్యూల్ ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని రమీజ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తొలి 4 మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో పాకిస్థాన్‌కు ఇంకా 3 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

Read Also: ఆరంభం నుంచి లీగ్‌లో నమోదైన గణాంకాలివే

ఇతర దేశాల మాదిరిగా కాకుండా పాకిస్తాన్‌లో మహిళల క్రికెట్‌లో ప్రతిభలో దూకుడుగా లేరని.. పీసీబీ చీఫ్ ఎత్తి చూపారు.

‘ వరల్డ్ కప్‌లో ప్రదర్శనల పట్ల నిరాశ చెందలేదు. వచ్చే ఏడాది జనవరిలో విదేశీ ప్లేయర్లతో కలిసి మహిళల కోసం పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. అండర్ -19 ప్లేయర్‌ల కోసం అక్టోబర్ నాటికల్లా పీఎస్‌ఎల్‌ని మార్పు చేస్తాం’ అని వెల్లడించాడు.

‘PCB తన ఆదాయ మార్గాలను కూడా పెంచుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం ICC , PSL నుండి వచ్చే ఆదాయంపై మాత్రమే పూర్తిగా ఆధారపడి ఉన్నారు. మరింత ఆదాయం పొందే దిశగా కృషి చేయాలి’ అని వివరించారు.