IPL రికార్డులు: ఆరంభం నుంచి లీగ్‌లో నమోదైన గణాంకాలివే

కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఈ లీగ్ కోసం ఫ్రాంచైజీలు తమ సొంతగడ్డలపై ప్రాక్టీసులో మునిగిపోయాయి. 2008లో మొదలైన ఈ లీగ్.. ఎన్నో రికార్డులు.. మరచిపోలేని విజయాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

IPL రికార్డులు: ఆరంభం నుంచి లీగ్‌లో నమోదైన గణాంకాలివే

కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఈ లీగ్ కోసం ఫ్రాంచైజీలు తమ సొంతగడ్డలపై ప్రాక్టీసులో మునిగిపోయాయి. 2008లో మొదలైన ఈ లీగ్.. ఎన్నో రికార్డులు.. మరచిపోలేని విజయాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

భారీ అంచనాల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్-12 మార్చి 23న మొదలుకానుంది. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఈ లీగ్ కోసం ఫ్రాంచైజీలు తమ సొంతగడ్డలపై ప్రాక్టీసులో మునిగిపోయాయి. 2008లో మొదలైన ఈ లీగ్.. ఎన్నో రికార్డులు.. మరచిపోలేని విజయాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
Read Also : దూల తీరింది: బీసీసీఐకి రూ.11 కోట్లు చెల్లించిన పాకిస్తాన్

జట్ల పరంగా:
1. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అత్యధికంగా 3 టైటిళ్లు దక్కించుకున్నవి 3 జట్లు (చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్)
2. లీగ్‌లో వరుస విజయాలు: 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా 9 మ్యాచ్‌లలో విజయాన్ని దక్కించుకున్నాయి. 
3. వరుస వైఫల్యాలు: 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 2012లో పూణె వారియర్స్ జట్లు వరుసగా వైఫల్యాలు దక్కించుకున్నాయి.
4. 263/5: అత్యధిక స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌గా 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పుణె వారియర్స్  మ్యాచ్ నిలిచింది.
5. అత్యల్ప స్కోరు: 2017లో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆడిన మ్యాచ్‌లో 49 పరుగుల అత్యల్ప స్కోరు నమోదైంది. 

బ్యాటింగ్ రికార్డులు:
1. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సురేశ్ రైనా(4985), విరాట్ కోహ్లీ(4948), రోహిత్ శర్మ (4493), గౌతం గంభీర్ (4217), రాబిన్ ఊతప్ప (4129)లు నిలిచారు. 
2. 175 అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసింది క్రిస్ గేల్ మాత్రమే. పూణె వారియర్స్ పై 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించి ఈ రికార్డు కొట్టేశాడు. 
3. ఐపీఎల్‌లో అత్యధికంగా 6 సెంచరీలను గేల్ బాది చూపించాడు. 
4. 973: కేవలం 2016ఒక్క సీజన్లోనే విరాట్ కోహ్లీ అత్యథిక పరుగులు చేయగలిగాడు.
5. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా డేవిడ్ వార్నర్ 39, విరాట్ కోహ్లీ 38, గౌతం గంభీర్, సురేశ్ రైనా 36 రికార్డుల్లోకి ఎక్కారు.

బౌలింగ్ రికార్డులు:
1. అత్యధిక వికెట్లు: లసిత్ మలింగ తానొక్కడే 154 వికెట్లు తీసి టాప్ 1 స్థానంలో నిలిచాడు. 
2. ఒక్క సీజన్ లో అత్యధిక వికెట్లు: డేన్ బ్రావో 32
3.  ఉత్తమ బౌలింగ్: 6/14: సొహైల్ తన్వీర్(రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, 2008)లో జరిగింది.
4. గరిష్టంగా హ్యాట్రిక్ చేసిన ప్లేయర్‌గా అమిత్ మిశ్రా 3సార్లు

ఫీల్డింగ్ రికార్డులు:
ఐపీఎల్ మొత్తంలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా సురేశ్ రైనా 95
ఒకే సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా ఏబీ డివిలయర్స్ 19(2016 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
వికెట్ కీపర్‌గా చేసిన అవుట్‌లు: దినేశ్ కార్తీక్ 124
కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచ్‌లు: ఎంఎస్ ధోనీ 159
ఒకే వేదికగా ఎక్కువ మ్యాచ్‌లు జరిగిన స్టేడియం: బెంగళూరు వేదికగా 74 
Read Also : ధోనీ గద్దలా: మరోసారి అభిమానితో పరుగుపందెం