Play was halted for a few minutes in the BAN vs IRE match due to an earthquake
BAN vs IRE : వెలుతురు లేకపోవడం లేదంటే వర్షం వంటి కారణాల వల్ల క్రికెట్‌లో అప్పుడప్పుడు మ్యాచ్ ఆగిపోవడాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్ల మధ్య (BAN vs IRE) ఢాకా వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భూకంపం కారణంగా మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు.
శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.7 తీవ్రత నమోదైంది. కాగా.. భూకంపం వచ్చిన సమయంలో మీర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్ల మధ్య మూడో రోజు ఆట కొనసాగుతోంది.
భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో కొద్ది సేపు ఆటను నిలిపివేశారు. కామెంటేటర్లు సైతం భూకంపం వచ్చినట్లు ధ్రువీకరించారు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఐర్లాండ్ ఆటగాళ్లు వెంటనే అక్కడి నుంచి బౌండరీ లైన్ వద్దకు పరుగులు తీశారు. ఇక మైదానంలోని ఆటగాళ్లకు అక్కడే నేలపై కూర్చుకున్నారు. స్టాండ్స్‌లో ఉన్న ఫ్యాన్స్ ఆందోళనకు గురి అయ్యారు. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది.
Strong earthquake in Bangladesh, hope everyone is safe. 🇧🇩 pic.twitter.com/VZ4QwbS9qm
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 21, 2025
మ్యాచ్ నిలిపివేసే సమయానికి ఐర్లాండ్ జట్టు 55 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. కాసేటి తరువాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
కాగా.. భూ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Goodness. Play has stopped here due to a minor tremor / earthquake.
— Cricket Ireland (@cricketireland) November 21, 2025
ఈ ఘటన గురించి ఐర్లాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా స్పందించింది. చిన్నపాటి భూకంపం కారణంగా మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిచివేసినట్లు రాసుకొచ్చింది.