PM Modi : ఫైన‌ల్‌లో ఓట‌మి.. టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌ధాని మోదీ..

PM Narendra Modi : మ్యాచ్ అనంత‌రం టీమ్ఇండియా ఆట‌గాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ప్ర‌ధాని మోదీ భార‌త ఆట‌గాళ్ల‌ను ప‌ల‌కరించారు.

PM Narendra Modi visit to Indian dressing room

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు చేరిన టీమ్ఇండియా ఆఖ‌రి మ్యాచ్‌లో ఓడిపోయింది. 12 ఏళ్ల త‌రువాత ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడే సువ‌ర్ణావ‌కాశాన్ని తృటిలో చేజార్చుకుంది. దీంతో 140 కోట్ల మంది భార‌తీయుల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. భార‌త జ‌ట్టు ఓడిపోయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఫైన‌ల్ వ‌ర‌కు అద్వితీయ ఆట‌తీరును క‌న‌బ‌రిచిన రోహిత్ సేనకు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఓట‌మి బాధ‌లో ఉన్న భార‌త ఆట‌గాళ్ల‌లో ఆత్మ‌విశ్వాస్వాన్ని పెంచేందుకు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న వంతు ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త ఆట‌గాళ్ల ప్రతిభ, సంకల్పం చెప్పుకోదగినవ‌న్నారు. గొప్ప స్ఫూర్తితో ఆడార‌ని కొనియాడారు. దేశానికి ఎనలేని గర్వాన్ని తెచ్చారని, దేశ ప్ర‌జ‌లు మొత్తం ఎల్లప్పుడూ అండ‌గా ఉంటామ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.

Rahul Dravid : చేజారిన క‌ప్‌.. రాహుల్ ద్ర‌విడ్ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థకం..!

కాగా..అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌ను ప్ర‌ధాని మోదీ ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. మ్యాచ్ అనంత‌రం టీమ్ఇండియా ఆట‌గాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ప్ర‌ధాని మోదీ భార‌త ఆట‌గాళ్ల‌ను ప‌ల‌కరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను భార‌త క్రికెట‌ర్లు ర‌వీంద్ర జడేజా, పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీలు పోస్ట్ చేశారు.

‘ఈ ప్రపంచకప్‌లో మేము మంచి ఆటతీరును కనబరిచాం. అయితే దుర‌దృష్ట వ‌శాత్తు నిన్నటి మ్యాచులో ఆశించిన ఫ‌లితం రాలేదు. మేమంతా ఓటమి బాధలో ఉన్నాం. కానీ.. దేశ ప్రజల మద్ధతు మాకు ఉంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించడం ప్రత్యేకంగా అనిపించింది, మాలో ఎంతో ఉత్తేజాన్ని నింపింది.’ అని జ‌డేజా ట్వీట్ చేశాడు.

Best Fielder Award : ఓట‌మి బాధ‌లోనూ బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డు.. ఎవ‌రికి ఇచ్చారో తెలుసా..?

‘దురదృష్టవశాత్తు నిన్న మన రోజు కాదు. టోర్నీ అంతటా మా జట్టుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వ‌చ్చి మాలో ఉత్సాహాన్ని నింపారు. ఇందుకు ఆయ‌నకు ప్ర‌త్యేక ధన్యవాదాలు. మేము బ‌లంగా తిరిగి వ‌స్తాము.’ అని ష‌మీ పోస్ట్ చేశాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వస్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కు ఆలౌలైంది. విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66), కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (47) లు రాణించారు. ఆసీస్‌ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ క‌మిన్స్ చెరో రెండు, మాక్స్‌వెల్‌, జంపాలు ఒక్కొ వికెట్ తీశారు. అనంత‌రం ట్రావిస్ హెడ్ (137) శ‌త‌కం చేయ‌డంతో ఆస్ట్రేలియా 43 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా రెండు వికెట్లు, మ‌హ్మ‌ద్ షమీ, సిరాజ్‌లు ఒక్కొ వికెట్ తీశారు.

Harbhajan Singh : విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ భార్య‌ల‌పై నోరు పారేసుకున్న హర్భజన్ సింగ్‌.. మండిప‌డుతున్న నెటీజ‌న్లు..