Harbhajan Singh : విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ భార్య‌ల‌పై నోరు పారేసుకున్న హర్భజన్ సింగ్‌.. మండిప‌డుతున్న నెటీజ‌న్లు..

Harbhajan Singh comments : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ల భార్య‌లు అనుష్క శ‌ర్మ‌, అతియా శెట్టిల పై మాజీ క్రికెట్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Harbhajan Singh : విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ భార్య‌ల‌పై నోరు పారేసుకున్న హర్భజన్ సింగ్‌.. మండిప‌డుతున్న నెటీజ‌న్లు..

Harbhajan Singh comments

వ‌రుస విజ‌యాల‌తో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కు చేరుకున్న భార‌త జ‌ట్టు ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డింది. ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు బాధ‌లో మునిగిపోయారు. అయితే.. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ల భార్య‌లు అనుష్క శ‌ర్మ‌, అతియా శెట్టిల పై మాజీ క్రికెట్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నెటీజ‌న్లు భ‌జ్జీ పై మండిపడుతున్నారు.

అస‌లు హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఏమ‌న్నాడంటే..?

ఫైన‌ల్ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా చూడ‌డంతో పాటు వారి భ‌ర్త‌ల‌ను ఎంకరేజ్ చేసేందుకు అనుష్క శ‌ర్మ‌, అతియా శెట్టిలు ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగిన అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియానికి వ‌చ్చారు. వీరిద్ద‌రు స్టాండ్స్‌లో ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. మ్యాచ్ జ‌రుగుతున్న‌ప్పుడు అప్పుడ‌ప్పుడూ కెమెరాలు ఈ ఇద్ద‌రిని ప‌లుమార్లు ఫోక‌స్ చేశాయి. అయితే ఆ స‌మ‌యాల్లో ఈ ఇద్ద‌రూ కూడా ఏదో విష‌య‌మై సీరియ‌స్‌గా చ‌ర్చించుకుంటున్న‌ట్లు కనిపించింది.

ODI World Cup 2023 awards : ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ గా కోహ్లీ.. ఎవ‌రెవ‌రికి ఏ అవార్డులు వ‌చ్చాయంటే..?

ఆ స‌మ‌యంలో హిందీ కామెంట‌రీ బాక్స్‌లో ఉన్న భార‌త మాజీ ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ వీరిద్ద‌రిని ఉద్దేశించి ప‌లు వ్యాఖ్య‌లు చేశాడు. వాళ్లు ఇద్ద‌రూ సినిమాలు, యాడ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చున‌ని, వాళ్ల‌కు క్రికెట్ గురించి ఏమీ తెలియ‌నే ఉద్దేశ్యంలో మాట్లాడాడు.

మండిప‌డుతున్న నెటీజ‌న్లు..

భ‌జ్జీ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పురుషాధిక్యాన్ని చూపిస్తున్నాయ‌ని ప‌లువురు నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. వెంట‌నే భ‌జ్జీ.. అనుష్క‌శ‌ర్మ‌, అతియా శెట్టిల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మాటలు మీ నుంచి ఊహించ‌లేద‌ని కామెంట్లు చేస్తున్నారు.

Mitchell Marsh : ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీని అగౌర‌వ‌ప‌రిచిన మిచెల్ మార్ష్‌..! దుమ్మెత్తిపోస్తున్న నెటీజ‌న్లు..వాళ్ల‌ను చూసి నేర్చుకో..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కు ఆలౌలైంది. విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66) లు హాఫ్ సెంచ‌రీలు చేయ‌గా, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (47) రాణించాడు. ఆసీస్‌ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు, జోష్ హేజిల్‌వుడ్, పాట్ క‌మిన్స్ చెరో రెండు, మాక్స్‌వెల్‌, జంపాలు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం ట్రావిస్ హెడ్ (137) సెంచ‌రీ చేయ‌డంతో ఆసీస్ 43 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా రెండు వికెట్లు, మ‌హ్మ‌ద్ షమీ, సిరాజ్‌లు ఒక్కొ వికెట్ తీశారు.