KKR vs MI : ఏంటి చిన్నా ఇదీ.. అంత మంది క‌ళ్లు గ‌ప్పి తీసుకుపోగ‌ల‌వా చెప్పు.. బాల్‌ను దొంగిలించే ప్ర‌య‌త్నం చేసిన ఫ్యాన్‌!

ఓ ఫ్యాన్ బంతిని దొంగించేందుకు చేసిన ప్ర‌య‌త్నానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Police catch KKR fan trying to steal match ball in pants during MI clash

Kolkata Knight Riders vs Mumbai Indians : ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ రేసు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు ఒక్క‌టే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఆరు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ఈ సీజ‌న్‌లో జ‌ట్లు అన్ని కూడా బాదుడే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లుగా క‌నిపిస్తున్నాయి. బ్యాట‌ర్లు సిక్స‌ర్లు, పోర్లతో అల‌రిస్తున్నారు. చాలా సార్లు బంతి ప్రేక్ష‌కుల మధ్య‌కు వెలుతోంది. అయితే.. ఓ ఫ్యాన్ బంతిని దొంగించేందుకు చేసిన ప్ర‌య‌త్నానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

గ‌త శ‌నివారం (మే 11న‌) కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా త‌ల‌ప‌డ్డాయి. కోల్‌క‌తా ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఇది చోటు చేసుకుంది. బ్యాట‌ర్ కొట్టిన బంతి గ్యాల‌రీలో ప‌డింది. ఓ ఫ్యాన్ అత్యుత్సాహంతో బాల్‌ను ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు. స్టాండ్స్‌లో ప‌డిన బంతిని ఇవ్వ‌కుండా త‌న ప్యాంట్ జేబులో వేసుకున్నాడు. దీన్ని గ‌మ‌నించిన మిగిలిన అభిమానులు, విష‌యాన్ని అక్క‌డే విధుల్లో ఉన్న ఓ పోలీసుకు చెప్పారు.

Rohit sharma : రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌నున్న రోహిత్ శ‌ర్మ‌? ఫామ్‌లో లేక‌పోయిన పాండ్య ఎంపిక అందుకేనా?

త‌మ‌దైన శైలిలో స‌ద‌రు పోలీసు బంతిని అత‌డి నుంచి తీసుకుని మ‌ళ్లీ మైదానంలోకి విసిరివేశాడు. అనంత‌రం స‌ద‌రు అభిమానిని మైదానం నుంచి వెళ్ల‌గొట్టారు. కేకేఆర్ జెర్సీని ధ‌రించిన స‌ద‌రు అభిమాని ఏదో చెప్పాల‌ని అనుకున్నా కూడా అక్క‌డ ఉన్న వారు వినిపించుకోలేదు. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేశారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. వ‌ర్షం ఈ మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగించ‌డంతో 16 ఓవ‌ర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై 16 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 139 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో కోల్‌క‌తా 18 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

Virat Kohli : సింహంతో ప‌రాచ‌కాలా..! మ‌న‌కెందుకు ఇషాంత్‌..! చూడు ఇప్పుడు ఏమైందో..?

కాగా.. నిన్న‌(మే 13) అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. దీంతో ఇరు జ‌ట్ల‌కు ఒక్కొ పాయింట్‌ను ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు