Praggnanandhaa : ప్ర‌జ్ఞానంద సంచ‌ల‌నం.. విశ్వనాథ‌న్ ఆనంద్‌కు షాక్‌.. భార‌త టాప్ చెస్ ప్లేయ‌ర్‌గా..

భార‌త యువ గ్రాండ్ మాస్టర్ ఆర్‌ ప్రజ్ఞానంద చ‌రిత్ర సృష్టించాడు.

Praggnanandhaa stuns World Champion Liren and surpasses Anand

R Praggnanandhaa : భార‌త యువ గ్రాండ్ మాస్టర్ ఆర్‌ ప్రజ్ఞానంద చ‌రిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గ‌జం విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌ను అధిగ‌మించాడు. ఫిడే ర్యాంక్సింగ్స్‌లో ఆనంద్‌ను దాటిన ప్ర‌జ్ఞానంద.. భార‌త టాప్ ర్యాంక‌ర్‌గా అవ‌త‌రించాడు.

టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్‌ నాలుగో రౌండ్‌లో చైనాకు చెందిన ప్ర‌పంచ ఛాంపియ‌న్ డింగ్ లిరెన్‌ను ఓడించిన ప్ర‌జ్ఞానంద ఈ ఘ‌న‌తను అందుకున్నాడు. ఈ గెలుపుతో ఫిడే పాయింట్ల‌ను మెరుగుప‌ర‌చుకున్నాడు. 2748.3 పాయింట్ల‌తో 11వ ర్యాంకు చేరుకున్నాడు. చెస్ దిగ్గ‌జం ఆనంద్ 2748 పాయింట్ల‌లో 12వ స్థానంలో కొన‌సాగుతున్నాడు.

NZ vs PAK : ఏమ‌య్యా.. 16 సిక్స్‌లు కొట్టావ్‌.. ఇంకొక్కటి బాదుంటేనా..?

డింగ్ లిరెన్ పై విజ‌యంతో ప్ర‌జ్ఞానంద మ‌రో ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. క్లాసిక‌ల్ చెస్ విభాగంలో ప్ర‌పంచ ఛాంపియ‌న్‌ను ఓడించిన రెండ‌వ భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. గ‌తంలో విశ్వ‌నాథ్ ఆనంద్ మాత్ర‌మే ప్ర‌పంచ ఛాంపియ‌న్‌ను ఓడించాడు.

ఇదిలా ఉంటే.. భార‌త దేశ నంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్‌గా ప్ర‌జ్ఞానంద నిల‌వడంపై అదానీ గ్రూప్ ఛైర్మ‌న్ గౌత‌మ్ అదానీ ఆనందం వ్య‌క్తం చేశారు. ‘అద్భుత‌మైన క్ష‌ణాలు. చైనాకు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి భారతదేశపు అగ్రశ్రేణి ఆటగాడిగా నిలిచావు. నిన్ను చూసి దేశం గ‌ర్వ ప‌డుతోంది.’ అని అదానీ అన్నారు.

ICC : బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్‌కు ఐసీసీ భారీ షాక్‌.. రెండేళ్ల పాటు నిషేదం.. ఎందుకంటే..?

కాగా.. గ‌తేడాది చెస్ ప్ర‌పంచ‌క‌ప్‌లో ప్ర‌జ్ఞానందం ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. దిగ్గజ ఆట‌గాడు కార్ల్‌స‌న్‌కు గ‌ట్టి పోటీ నిచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు