Prime Volleyball League KL Rahul becomes co-owner of Goa Guardians
KL Rahul : టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL)లో ఓ జట్టును కొనుగోలు చేశాడు. గోవా గార్డియన్స్‌కు అతడు సహయజమానిగా వ్యవహరించనున్నాడు. హైదరాబాద్ వేదికగా పీవీఎల్ లీగ్ నాలుగో సీజన్ అక్టోబర్ 2 నుంచి 26 వరకు జరగనుంది. కాగా.. ఈ సీజన్‌తోనే గోవా తొలిసారి ఈ లీగ్‌లో అడుగుపెట్టనుంది. రాజు చేకూరి ఈ టీమ్‌కు యజమానిగా ఉన్నారు.
దేశంలో వాలీబాల్‌కు ఆదరణను పెంచాలనే ఉద్దేశ్యంతోనే తాను పెట్టుబడి పెట్టినట్లు రాహుల్ (KL Rahul) వెల్లడించాడు. భారత క్రీడల్లో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఒక కీలక మలుపు అని చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి వాలీబాల్‌ను ఎంతో ఇష్టంగా చూసేవాడినని, ఇప్పుడు అదే క్రీడకు సంబంధించిన లీగ్‌లో తాను భాగం కావడం సంతోషంగా ఉందన్నాడు.
గోవా గార్డియన్స్ ప్రధాన యజమాని రాజు చేకూరి.. రాహుల్ భాగస్వామ్యాన్ని స్వాగతించారు, రాహుల్ కు వాలీబాల్ పట్ల ఉన్న మక్కువ, దాని సామర్థ్యంపై నమ్మకం.. అభిమానులను ప్రేరేపించే, ఆటగాళ్లను శక్తివంతం చేసే ఫ్రాంచైజీని నిర్మించడంలో సహాయపడుతుందని ఆయన నొక్కి చెప్పారు.
విండీస్‌తో సిరీస్‌తోనే..
ఆసియాకప్ 2025లో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. వెస్టిండీస్‌తో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతడు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అంతకన్నా ముందు అతడు నేటి (సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభమైన భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య రెండో అనధికార టెస్టు మ్యాచ్‌లో ఆడుతున్నాడు.
Hardik Pandya : బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. హార్దిక్ పాండ్యాను ఊరిస్తున్న భారీ రికార్డు..
ఇంగ్లాండ్ పర్యటనలో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. ఐదు టెస్టుల్లో 53.20 సగటుతో 532 పరుగులు సాధించాడు.