Prithvi Shaw : పృథ్వీ షా కీల‌క నిర్ణ‌యం.. నా దారి నేను చూసుకుంటా.. మీ త‌రుపున ఆడేదే లేదు.. ఎన్ఓసీ ఇచ్చేయండి..

టీమ్ఇండియా ఆట‌గాడు, ముంబై స్టార్ క్రికెట‌ర్ పృథ్వీ షా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

Prithvi Shaw seeks No Objection Certificate from Mumbai

టీమ్ఇండియా ఆట‌గాడు, ముంబై స్టార్ క్రికెట‌ర్ పృథ్వీ షా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక పై దేశ‌వాళీ క్రికెట్‌లో ముంబై త‌రుపున ఆడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాడు. తాను వేరే రాష్ట్రం త‌రుపున ఆడాల‌ని అనుకుంటున్న‌ట్లు, త‌న‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ని ఇవ్వాల్సిందిగా పృథ్వీ షా ముంబై క్రికెట్ అసోసియేష‌న్‌ను కోరాడు.

ముంబై క్రికెట్ అసోసియేష‌న్ కు చెందిన ఓ అధికారి ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. ‘అవును షా ఎంసీఏ నుంచి ఎన్ఓసీ కావాల‌ని అడిగాడు. త్వ‌ర‌లోనే దానిపై మేం ఓ నిర్ణ‌యం తీసుకుంటాము.’ అని స‌ద‌రు అధికారి తెలిపిన‌ట్లు ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

Rishabh Pant: అయ్యో పంత్.. అలా ఎందుకు చేశావ్..! చర్యలకు సిద్ధమైన ఐసీసీ..

ఎంసీఏతో గ‌త కొన్నాళ్లుగా విభేదాలు..!
గ‌త కొన్నాళ్లుగా ముంబై జ‌ట్టుతో షాకు సంబంధాలు దెబ్బ‌తిన్న‌ట్లుగా తెలుస్తోంది. పేల‌వ ఫామ్‌, ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌తో రంజీట్రోఫీ 2023లో ముంబై జ‌ట్టు నుంచి షాను తొల‌గించారు. షా శ‌రీరంలో అధిక ఫ్యాట్ ఉంద‌ని, బ‌రువు ఎక్కువ‌గా ఉన్నాడ‌ని, క్ర‌మ‌శిక్ష‌ణ లోపించింద‌ని ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ సెల‌క్ట‌ర్ల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌తేడాది విజ‌య్ హాజారే ట్రోఫీలోనూ అత‌డికి చోటు ద‌క్క‌లేదు.

ఈ నేప‌థ్యంలోనే షా ముంబైని వీడాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. రాబోయే దేశ‌వాళీ క్రికెట్ సీజ‌న్ కోసం షా ఇప్ప‌టికే రెండు, మూడు రాష్ట్రాల జ‌ట్ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ముంబై ఎన్ఓసీ ఇవ్వ‌గానే తాను ప్రాతినిథ్యం వ‌హించే రాష్ట్ర జ‌ట్టును షా వెల్లడించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ENG vs IND : టెస్టుల్లో రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌న‌త‌..

పృథ్వీ షా ముంబై జట్టు తరపున 58 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. 4556 పరుగులు చేశాడు. అదే విధంగా 65 లిస్ట్‌-ఎ, 117 టీ20ల్లో ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు.