Prithvi Shaw
Prithvi Shaw – Prachi Singh: టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా నిజంగానే ప్రచీ సింగ్‌తో డేటింగ్ లో ఉన్నాడా.. ఇన్‌స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండటమే కాకుండా ఒకరి పోస్టులకు ఒకరు లైకులు, కామెంట్లు చేయడం వెనుక అసలు విషయం ఏంటి. ఓ లుక్కేయండి మరి..
విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన షాకు పొగడ్తల వర్షం కురుస్తుంది. ఉత్తరప్రదేశ్‌తో ఆడిన ఫైనల్ మ్యాచ్‌లో 39బంతుల్లోనే 73పరుగులు చేసేశాడు. అదే కాకుండా ఈ టోర్నీలో సింగిల్ ఎడిషన్ లోనే 800పరుగులకు మించిన పరుగులు నమోదు చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు.
ఇప్పటి వరకూ తమ ఇద్దరి మధ్య రిలేషన్ గురించి నోరు విప్పలేదు. అయినా సోషల్ మీడియాలో రెస్పాన్స్ ను బట్టి ఒకరితో ఒకరి రిలేషన్ గురించి పలు రూరమలుల వినిపిస్తున్నాయి.
1995 జులై 22లో పుట్టిన ప్రచీ.. 2019లో ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. టీవీ సీరియల్ ఉడాన్ లోని నటించారు. అంతేకాకుండా ఆమె ఓ అద్భుతమైన బెల్లీ డ్యాన్సర్ కూడా. స్టైలిష్ అవుట్ ఫిట్స్ తో ఫొటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు కూడా.
ప్రస్తుతం ‘ఇండియావాలీ మా’ సీరియల్ లో నటిస్తున్న ఈమె.. కీర్తి రావు అనే పాత్రలో పోషిస్తున్నారు. ఈ షో కాన్సెప్ట్ ఏంటంటే.. తల్లి-కొడుకుల మధ్య సంబంధం గురించి తెలియజేస్తుంటుంది. ముంబై యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పూర్తి చేసింది.