Priyank smashed 90 runs on his debut in Nepal Premier League
Priyank Panchal : నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో భారత దేశవాలీ స్టార్ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ లీగ్ చరిత్రలో అరంగ్రేట మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్‌లో కర్నాలీ యాక్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాంక్.. చిట్వాన్ రైనోస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అరంగేట్రంలో ఓ ప్లేయర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే.
ప్రియాంక్ మెరుపులతో తొలుత బ్యాటింగ్ చేసిన యాక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ప్రియాంక్ కాకుండా పవన్ సర్రాఫ్ (16 బంతుల్లో 27 నాటౌట్) రాణించాడు. మ్యాక్స్ ఓడౌడ్ (20), మార్క్ వాట్ (16) పర్వాలేదనిపించారు. రైనోస్ బౌలర్లలో సోహైల్ తన్వీర్, రవి బొపారా చెరో వికెట్ సాధించారు.
Mohammed Shami : భారత జట్టులోకి నో ఛాన్స్.. షమీ కీలక నిర్ణయం..!
ఆ తరువాత 167 పరుగుల లక్ష్యాన్ని రైనోస్ 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది. రైనోస్ బ్యాటర్లలో రవి బొపారా (36 బంతుల్లో 52 పరుగులు) హాఫ్ సెంచరీ బాదాడు. దీపక్ బొహారా (42), సైఫ్ జైబ్ (38) రాణించారు. యాక్స్ బౌలర్లలో సోంపాల్ కామీ రెండు వికెట్లు తీశాడు.
HISTORY BY PRIYANK PANCHAL…!! 💥
– Priyank smashed 90 runs on his debut in Nepal Premier League, highest ever score by a player on Debut in this league. pic.twitter.com/QV0YHHshoF
— Johns. (@CricCrazyJohns) November 19, 2025
ప్రియాంక్ పంచల్ ఇటీవలే భారత క్రికెట్‌లో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నాడు. విదేశీ లీగ్‌లు ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా.. దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రియాంక్ మంచి రికార్డు ఉంది. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటుతో 8856 పరుగులు సాధించాడు. ఇందులో 23 సెంచరీలు ఉన్నాయి.
Priyank Panchal announced himself in #NPL 2025 with a blistering 90 off 48 balls 🔥 pic.twitter.com/iLPzSmwXwU
— FanCode (@FanCode) November 18, 2025