Mohammed Shami : భార‌త జ‌ట్టులోకి నో ఛాన్స్‌.. ష‌మీ కీల‌క నిర్ణ‌యం..!

టీమ్ఇండియా వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ (Mohammed Shami) జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

Mohammed Shami : భార‌త జ‌ట్టులోకి నో ఛాన్స్‌.. ష‌మీ కీల‌క నిర్ణ‌యం..!

Mohammed Shami to play in Syed Mushtaq Ali Trophy 2025 for Bengal

Updated On : November 20, 2025 / 2:52 PM IST

Mohammed Shami : టీమ్ఇండియా వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో మ‌రోసారి రాణించి సెల‌క్ట‌ర్ల‌కు స‌వాల్ విసిరేందుకు సిద్ధం అయ్యాడు. డిసెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న దేశ‌వాళీ టీ20 టోర్నీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాల‌ని ష‌మీ నిర్ణ‌యం తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోషియేష‌న్‌కు ఇప్ప‌టికే త‌న నిర్ణ‌యాన్ని అత‌డు తెలియ‌జేసిన‌ట్లుగా రేవ్ స్పోర్ట్స్ పేర్కొంది.

మ‌హ్మ‌ద్ ష‌మీ చివ‌రిసారిగా భార‌త్ త‌రుపున ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీలో బ‌రిలోకి దిగాడు. ఈ టోర్నీ త‌రువాత అత‌డు మ‌రోసారి భార‌త జెర్సీలో క‌నిపించ‌లేదు. ఆసియాక‌ప్ 2025తో పాటు ఇంగ్లాండ్‌, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌ల‌కు సెల‌క్ట‌ర్లు అత‌డిని ఎంపిక చేయ‌లేదు.

Parthiv Patel : వాట‌ర్ బాటిళ్లు అందించి పెద్ద ఇళ్లు క‌ట్టుకున్నా.. 2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న పాత్ర‌పై పార్థివ్ ప‌టేల్ కామెంట్స్‌..

రంజీల్లో అదుర్స్..

అయితే.. సెల‌క్ట‌ర్లు జాతీయ జ‌ట్టుకు ఎంపిక చేయ‌క‌పోవ‌డంతో దేశ‌వాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు ష‌మీ. ఇటీవ‌ల జ‌రిగిన రంజీట్రోఫీలో బెంగాల్ త‌రుపున బ‌రిలోకి దిగాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 20 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

IND vs PAK : ఇదేం ట్విస్ట్ సామీ.. భారత్, పాక్ మ్యాచ్ లేకుండానే వరల్డ్ కప్ షెడ్యూల్.. రిలీజ్ చేసిన ఐసీసీ

ఇక వ‌చ్చే ఏడాది అత‌డు ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌రుపున ఆడ‌నున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన ట్రేడింగ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ష‌మీని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ట్రేడింగ్ చేసింది. ఇక ల‌క్నో నుంచి రూ.10 కోట్ల మొత్తాన్ని ష‌మీ అందుకోనున్నాడు.